Zootopia: ఇదేం బొమ్మల సినిమా మావా.. చరిత్ర తిరగరాసేస్తోందిగా..

బొమ్మల సినిమా కదా అని ఏదో వచ్చి అలా అలరించేసి వెళ్లి పోతుందేమో అనుకున్నారంతా. కానీ వచ్చి మొత్తం బాక్సాఫీసు రికార్డులను తిరగరాస్తోంది. అదే ‘జూటోపియా 2’. తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన ‘జూటోపియా’కు సీక్వెల్‌గా ఈ యానిమేషన్‌ బొమ్మల సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా నవంబరు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ హాలీవుడ్ సినిమా చైనాలో ఒక్క రోజులో 104 మిలియన్ డాలర్స్ రాబట్టింది. అంటే ఇది మన కరెన్సీలో రూ.930 కోట్లు. ఇప్పుడిదే రికార్డు అని చెబుతున్నారు.

Zootopia

ఈ బొమ్మల సినిమా చైనా మార్కెట్‌లో ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’ డే 1 రికార్డు గ్రాస్ వసూళ్లను క్రాస్‌ చేసింది అని చెబుతున్నారు. ఈ ఏడాదిలో చైనాకి చెందిన ‘నే జాహ్’ అనే యానిమేషన్ సినిమా 2 బిలియన్ డాలర్స్ రాబట్టింది. ఇదంతా చూస్తుంటే యానిమేషన్ సినిమాల హవా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఐదు రోజులు అయ్యేసరికి చైనాలో ఈ సినిమా 272 మిలియన్‌ డాలర్ల వసూళ్లు అందుకుంది. ‘అవెంజర్స్‌: ఎండ్‌ గేమ్‌’ తర్వాత భారీ వసూళ్లు ఈ సినిమాకే అంటున్నారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే.. ఐదు రోజులకుగాను 560 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది. ఈ వసూళ్లతో ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’, ‘అవెంజర్స్‌: ఇన్ఫినిటీ వార్‌’, ‘స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌’ సినిమాల తర్వాత నాలుగో స్థానంలో నిలిచింది. ఇదంతా ఓకే ఆ సినిమాకు చైనాలో ఎందుకంత వసూళ్లు వస్తున్నాయనేగా డౌట్‌.. చైనాలో షాంఘాయ్‌లోని డిస్నీ రిసార్ట్‌లో జూటోపియా థీమ్‌ అట్రాక్షన్‌ ఉంది. అక్కడికి పిల్లలు రిపీట్‌ మోడ్‌లో వస్తుంటారట. అందుకే ఈ సినిమాకు చైనాలో మంచి స్పందన వస్తోంది అని చెబుతున్నారు.

రొమాంటిక్‌ రోల్స్‌పై సీనియర్‌ స్టార్‌ హీరో కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus