అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఎక్కువగా బాలీవుడ్లోనే సినిమాలు,వెబ్ సిరీస్..లు చేస్తుంది. 50 ఏళ్ళ వయసు దాటినా ఇప్పటికీ యంగ్ యాక్టర్స్ తో ఇంటిమే*ట్ సీన్స్ లో నటిస్తూ ఈమె చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. మరోపక్క మంచి పాత్రలు కూడా చేస్తుంది. ఇప్పుడు టబు ఓటీటీ మార్కెట్ చాలా బాగుంది. ఈమె కానీ, విద్యాబాలన్ (Vidya Balan) కానీ ఓటీటీ మూవీ లేదా వెబ్ సిరీస్..లలో నటిస్తున్నారు అంటే.. వాటికి భారీ డిమాండ్ ఏర్పడుతుంది.
నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి సంస్థలు కేవలం వీళ్ళను చూసి కోట్లు పెట్టి కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది పక్కన పెడితే.. టబు ఇప్పుడు మళ్ళీ తెలుగులో ఓ సినిమా చేస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ఛార్మి, పూరి కలిసి నిర్మిస్తున్నారు.
ఈ సినిమా కోసం టబు దాదాపు కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు టాక్. ఈమె ఉంది కాబట్టి.. హిందీలో కూడా డబ్బింగ్, శాటిలైట్, ఓటీటీ రైట్స్ రూపంలో మంచి ఆఫర్స్ వస్తాయి. అందుకే పూరీ (Puri Jagannadh) , ఛార్మి (Charmy Kaur) .. టబు డిమాండ్ చేసినంత ఇవ్వడానికి రెడీ అయ్యారు అని స్పష్టమవుతుంది.