మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయిగా 2007 వ సంవత్సరం సెప్టెంబర్ 28న ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాంచరణ్. అంటే ఇతను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 13 ఏళ్ళు కావస్తోంది. ఇప్పుడు మెగాస్టార్ ట్యాగ్ ఇతనికి అవసరం లేదు. ఇతనే మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ ను సంపాదించుకున్నాడు. అటు చిరంజీవికి.. ఇటు పవన్ కళ్యాణ్ కు.. ఏమాత్రం తీసిపోని, చెప్పాలంటే అంతకు మించే అభిమానులను సంపాదించుకున్నాడు చరణ్ అని చెప్పాలి. కేవలం సినిమాలతోనే కాకుండా.. ఫిలాంత్రోఫిక్ యాక్టివిటీస్ తో కోట్లాది మంది అభిమానుల ప్రేమను పొందాడు చరణ్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒకసారి చరణ్ 13ఏళ్ళ జర్నీని ఓసారి పరిశీలిద్దాం :
1) పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘చిరుత’ చిత్రంలో డ్యాన్స్ లు, ఫైట్ లు అద్భుతంగా చేసి మాస్ ఆడియెన్స్ అటెన్షన్ ను డ్రా చేసాడు. డెబ్యూ హీరోల సినిమాల్లో అత్యథిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో ఇది ఒక రికార్డుని సృష్టించింది.
2) రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ‘మగధీర’ చిత్రం చరణ్ కు రెండో మూవీ అంటే ఎవ్వరూ నమ్మరు. అంత బాగా నటించాడు. కాలభైరవ గా 100మంది సైనికులతో చేసిన ఫైట్ అందులో అతను పలికించిన హావ భావాలు అత్యద్భుతంగా ఉంటాయి.
3) రెండో సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి తరువాత ‘ఆరెంజ్’ లాంటి లవ్ స్టోరీ చేస్తున్నాడు ఏంటి? అని చరణ్ ను విమర్శించిన వాళ్ళు లేకపోలేదు. వారి అనుమానాలకు తగినట్టుగానే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ ఇది ఒక క్లాసిక్ గా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. చరణ్ మెచ్యూరిటీ ఏంటనేది ‘ఆరెంజ్’ తో క్లుప్తంగా అర్థంచేసుకోవచ్చు.
4) రచ్చ,నాయక్, ఎవడు, గోవిందుడు అందరి వాడేలే.. వంటి చిత్రాలతో వరుసగా నాలుగు సార్లు రూ.40కోట్ల పైన షేర్ ను సాధించిన ఘనత కూడా అప్పటికి చరణ్ కే దక్కిందని చెప్పాలి.
5) 2012 లో ఉపాసన ను పెళ్లి చేసుకున్నాడు రాంచరణ్. అటు తరువాత ఇతని లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి.
6) చరణ్ మంచి బిజినెస్ మెన్ కూడా..! ఇతను ట్రూ జెట్ ఎయిర్ లైన్స్ లో పార్ట్నర్ కూడా..! అంతేకాదు గతంలో ‘మా టీవీ’ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చరణ్ కూడా ఒక మెంబర్.
7) ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ ను స్థాపించి, తన తండ్రి మెగా స్టార్ చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’ మూవీని తెరకెక్కించాడు. మెగాస్టార్ కు ఇది రీ ఎంట్రీ మూవీ.. ‘బాహుబలి1’ తరువాత 100కోట్ల షేర్ ను సాధించిన మూవీ ఇదే..!
8) మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలా వాడ నరసింహరెడ్డి జీవిత కథతో ‘సైరా నరసింహారెడ్డి’ అనే పాన్ ఇండియా మూవీని కూడా రూపొందించాడు.
9) ‘రంగస్థలం’ మూవీలో తన నట విశ్వరూపాన్ని చూపించాడు చరణ్. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి పాన్ ఇండియా మూవీలో అల్లూరి సీతారామ రాజుగా కనిపించబోతున్నాడు.
10) ఇప్పటి వరకూ 2 నేషనల్ అవార్డులు మరియు 2 నంది అవార్డులుసాధించాడు. చరణ్ యానిమల్ లవర్ అలాగే హార్స్ రైడర్ కూడా..!