Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Focus » Prince Movie: ‘ప్రిన్స్’ కు నెగిటివ్ టాక్ రావడానికి 10 కారణాలు..!

Prince Movie: ‘ప్రిన్స్’ కు నెగిటివ్ టాక్ రావడానికి 10 కారణాలు..!

  • October 22, 2022 / 01:45 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prince Movie: ‘ప్రిన్స్’ కు నెగిటివ్ టాక్ రావడానికి 10 కారణాలు..!

కొన్ని సినిమాలు హిట్ అవుతాయని అస్సలు ఊహించము.అలాంటివి కొన్ని బ్లాక్ బస్టర్లు అయ్యి భారీ లాభాలను తెచ్చిపెడతాయి. ‘జాతి రత్నాలు’ కూడా అలాంటి సినిమాల్లో ఒకటి. ఆ సినిమా కరోనా సెకండ్ వేవ్ కు ముందు వచ్చి భారీ లాభాలను బయ్యర్స్ కు అందించింది. దర్శకుడు అనుదీప్ కేవీ ఈ చిత్రంతో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టు ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఊపు ఉండగానే శివ కార్తికేయన్ వంటి తమిళ స్టార్ హీరోతో సినిమాని ఓకే చేసేసుకున్నాడు. అదే ప్రిన్స్. ట్రైలర్ బాగానే అనిపించింది. కాకపోతే ఈరోజు రిలీజ్ అయిన ఆ చిత్రానికి నెగిటివ్ టాక్ వస్తుంది. ఈరోజు 4 సినిమాలు రిలీజ్ అయితే నెగిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే కావడం గమనార్హం. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1)’జాతి రత్నాలు’ సినిమా హిట్ అయ్యింది అంటే అందులో కామెడీ వర్కౌట్ వల్లనే కాదు. అందులో నటించిన నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి వంటి వారి నటన యూత్ ను బాగా ఆకట్టుకుంది. వారి కామెడీ టైమింగ్ కూడా అదిరిపోయింది. అయితే ప్రిన్స్ లో మొత్తం అరవం బ్యాచ్ ఉన్నారు. అనుదీప్ రైటింగ్ కు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అస్సలు మ్యాచ్ అవ్వలేదు. శివ కార్తికేయన్ మాత్రం ఓకే అనిపించాడు.

2) ఇక అనుదీప్ కూడా గొప్పగా కామెడీ ట్రాక్ లు రాయలేదు.ఇతను అనిల్ రావిపూడి, మారుతి ల కంటే కూడా కుళ్ళు జోకులు పేల్చాలని చూశాడు. కాకపోతే బాగా పేలాల్సిన కొన్ని వన్ లైనర్స్ కూడా ఆ అరవ క్యాస్టింగ్ వల్ల వేస్ట్ అయిపోయాయి.

3)కథ కూడా ట్రైలర్ లో చెప్పినట్టు గతంలో చాలా సార్లు చూసిందే. కానీ ఇంత పేలవమైన టేకింగ్ తో చూడడం ఇదే మొదటి సారి.

4) అన్ని సినిమాల కథలు బాగుంటాయి అని చెప్పడం తప్పు. కథనం పైనే సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అది కూడా మైనస్సే. ఎంత మైనస్ అంటే చాలా వరకు అనవసరమైన సన్నివేశాలు కూడా ఇరికించేసేంత మైనస్ అనమాట.

5)ఈ సినిమాలో ఎటు చూసినా కామెడీ గురించే మాట్లాడుకోవాలి. సరైన పంచ్ డైలాగులు పడినప్పుడు నటీనటుల హావభావాలు పలకకపోతే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అయినా కొంత పుష్ చేయాలి. ఇందులో తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రిచ్ గా ఉన్నా.. సీన్ కు సింక్ అయ్యే విధంగా లేదు. అది నేపధ్య సంగీతం మైనస్ అనలేము కానీ అనక తప్పదు.

6) హీరోయిన్ మారియా… ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఒలీవియా మోరిస్ లా తన నటన, హావభావాలతో అలరిస్తుంది అనుకుంటే.. ఆమె చాలా ఇబ్బంది పడుతూ నటించిన ఫీలింగ్ కలిగిస్తుంది.

7) సత్యరాజ్ పాత్ర కమెడియన్ కు ఎక్కువ, సహాయ నటుడి పాత్రకు తక్కువ అన్నట్టు ఉంటుంది.

8) విలన్ పాత్రలతో ఫేమస్ అయిన ఆనంద్ రాజ్ ఈ మధ్యన ఎక్కువగా తనకు సూట్ అవ్వని కామెడీ రోల్స్ చేస్తున్నాడు. ఇందులో కూడా అతని పాత్ర పండలేదు.

9) ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా.. సెకండాఫ్, క్లైమాక్స్ బాగుంటే సినిమా గట్టెక్కేసినట్టే..! ఇందులో అలా గొప్పగా చెప్పుకోవడానికి ఉండదు. సెకండ్ హాఫ్ బాగుంటుందేమో అనుకుంటే.. అక్కడికెళ్ళాక ఫస్ట్ హాఫ్ బెటర్ అనిపిస్తుంది. క్లైమాక్స్ బాగుంటుందేమో అనుకుంటే.. అదీ మైనస్సే. ముందే బెటర్ అనిపిస్తుంది.

10)పాటల విషయంలో ‘బింబిలి’ తప్ప మిగిలినవి ఎక్కడా వినసొంపుగా ఉండవు.

Sivakarthikeyan Prince Movie Trailer Review

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anudeep KV
  • #Maria Ryaboshapka
  • #Premgi Amaren
  • #Prince Movie
  • #Satyaraj

Also Read

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

related news

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Maruthi: ‘బార్బరిక్’ అంటే ‘బార్బిక్యూ’ లా అనిపించింది.. చెప్పుతో కొట్టుకుంటే బాధేసింది

Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

Madharaasi Review in Telugu: మదరాసి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

Kantara Chapter 1 Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘కాంతార చాప్టర్ 1’

3 hours ago
Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్  ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Ninne Pelladatha Movie: నాగార్జున ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘నిన్నే పెళ్ళాడతా’ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

5 hours ago
Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

Ari: ‘అరి’ కోసం 7 ఏళ్ళ శ్రమ.. దర్శకుడు జయశంకర్ చేసిన పరిశోధన ఇదే

6 hours ago
Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

Mirai OTT: నెల తిరగకుండా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘మిరాయ్’

8 hours ago
Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

9 hours ago

latest news

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

Sujeeth: సుజిత్ పై ఇన్ని కంప్లైంట్స్ ఉన్నా.. నాని ఎలా యాక్సెప్ట్ చేశాడు?

5 hours ago
Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

8 hours ago
Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

9 hours ago
Rahul Ramakrishna: అప్పుడు కవర్‌ చేశాడు.. ఇప్పుడు ఆ పని చేయలేక ఏకంగా అకౌంట్‌ డీయాక్టివేట్‌!

Rahul Ramakrishna: అప్పుడు కవర్‌ చేశాడు.. ఇప్పుడు ఆ పని చేయలేక ఏకంగా అకౌంట్‌ డీయాక్టివేట్‌!

10 hours ago
Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version