మీరా చోప్రా వివాదంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అరెస్ట్ తప్పేలా లేదు. జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ మారిన ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మీరా చోప్రా పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పలువురు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్విట్టర్ అకౌంట్స్ ని సైబర్ పోలీసులు గుర్తించారు. గుర్తించిన వారి అడ్రెస్స్ లు పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. సదరు అభిమానుల గుర్తింపు పూర్తి అయిన వెంటనే వీరిని అదుపులోకి తీసుకొని విచారించనున్నారు. ఇప్పటికే వీరిపై కఠిన చట్టాల క్రింద కేసులు నమోదు అయ్యాయి.
వీరు చేసిన నేరం నిరూపణ అయితే కఠిన శిక్షలు పడడం ఖాయం అని న్యాయ నిపుణులు చెవుతున్నారు.వీరిలో కొందరు ఇప్పటికే తమ ట్విట్టర్ అకౌంట్స్ డిలీట్ చేసుకున్నారు. దాదాపు 10మంది వరకు తమ ట్విట్టర్ అకౌంట్స్ డిలీట్ చేశారు. కొద్దిరోజుల క్రితం నటి మీరా చోప్రా ట్విట్టర్ లో తమ అభిమానులతో చాటింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఓ అభిమాని ఎన్టీఆర్ గురించి ఏమైనా చెప్పండి అని అడిగారు. దానికి సమాధానంగా ఎన్టీఆర్ గురించి నాకు అంతగా తెలీదు.
ఎందుకు అంటే నేను ఎన్టీఆర్ ఫ్యాన్ ని కాదు అన్నారు. దీనితో కోపానికి గురైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెపై ట్విట్టర్ వార్ మొదలుపెట్టారు. ఆమెను అనుచితమైన మాటలతో తిట్టడంతో పాటు, చంపేస్తాం, రేప్ చేస్తాం అనే దారుణమైన బెదిరింపులకు దిగారు. దీనితో మీరా చోప్రా సదరు ఫ్యాన్స్ పై సైబర్ పోలీసులకు పిర్యాదు చేసింది. అలాగే జాతీయ మహిళా కమీషన్ లో పిర్యాదు చేశారు. మీరా చోప్రాకు ఈ కేసు విషయంలో అనేక మంది మద్దతుగా వచ్చారు.