అర్జున్ రెడ్డి “A” రేటెడ్ మూవీ విమర్శ… అర్జున్ రెడ్డి గొప్ప ప్రేమ కథ ప్రసంశ. ఏ కథలోనైనా మంచి చెడు రెండూ ఉంటాయి. మనం చూసే కోణంపై అది ఆధారపడి ఉంటుంది. పుస్తకం కవర్ పేజీ చూసి.. ఆ పుస్తకంపై ఒక అభిప్రాయానికి రాకూడదనేది.. ఎంత సత్యమో .. అర్జున్ రెడ్డి పోస్టర్ చూసి అది బూతులతో నిండి ఉన్నదని చెప్పకూడదు. ఈ సినిమా చూసి యువత అనేక విషయాలు నేర్చుకోవచ్చు. అవి ఏమిటో తెలుసుకుందామా..
లైఫ్ అంటే ప్రేమ ఒక్కటే కాదు జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి. వాటిని ఎదురునిలిచి గెలవాలి. ప్రేమ ఫెయిల్ అయినంత మాత్రాన ఆత్మహత్య చేసుకోకూడదని అర్జున్ రెడ్డి చెప్పాడు. సినిమా లో ప్రీతి వదిలేసినా కూడా అర్జున్ రెడ్డి బెస్ట్ డాక్టర్ గా పేరు తెచ్చుకుంటాడు.
నువ్వు నువ్వులా ఉండు ఒక్కొక్కరూ ఒక్కో విధంగా మనకి సలహా ఇస్తుంటారు. ఆ సలహా మేరకు మనల్ని మనం మార్చుకుంటే చివరికి మనం కనిపించం. అందుకే నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు.. అదే నీ బలం, నీ విజయం అని అర్జున్ రెడ్డి తన ఆటిట్యూడ్ తో చెప్పాడు.
డ్రగ్స్ జోలికి వెళ్ళవద్దుసినిమాలో ప్రీతి పెళ్లి జరుగుతున్నప్పుడు అర్జున్ రెడ్డి ఆపలేని పరిస్థితిలోఉంటాడు. దానికి కారణం మొర్ఫిన్ తీసుకోవడం. కానీ యువకులు ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోకూడదు. మనల్ని ప్రేమించే వారిని సొంతం చేసుకోవడానికి కష్టపడాలి.
స్నేహితులు ఉండాలి సంతోషంలోనే కాదు బాధల్లో తోడుండే ఫ్రెండ్ ఉండడం అదృష్టం. అటువంటి ఫ్రెండ్ ని ఎప్పటికి వదులుకోవద్దు. అర్జున్ రెడ్డి కి ఉన్న “శివ” లాంటి ఫ్రెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలి.
దైర్యంగా మాట్లాడు శివతో అర్జున్ రెడ్డి వైఫ్ పీరియడ్స్ గురించి చాలా ఓపెన్ గా మాట్లాడతాడు. మనమేమో అదేదో బూతులాగా చూస్తాము. మన ఆలోచన మంచిది అయినప్పుడు అది బూతు అవ్వదు. ధైర్యంగా మాట్లాడు. మంచోడు అని పేరు తెచ్చుకోవడానికి నీ భావాలను దాచుకోవద్దు.
బాధ పడాలి జీవితమనే సముద్రాన్ని కష్టాలు, బాధలు పడకుండా దాటలేము. అందుకే బాధకలిగినప్పుడు బాధపడనివ్వడం ఎంతో రిలీఫ్ ని కలిగిస్తుంది. ఆ విషయాన్నీ అర్జున్ నానమ్మ “సఫర్ అవ్వనివ్వు” అంటూ చెబుతుంది. ఎందుకంటే ఎదుటోడిని బాధ పడకు అని చెప్పగలము కానీ బాధను పంచుకోలేము.
ఆత్మీయులకు ఒక్క క్షణం బిజీ లైఫ్ లో బతికున్నప్పుడే ఆత్మీయులతో గడపలేకపోతున్నారు చాలామంది. ఇక చనిపోతే పట్టించుకోవడం లేదు. అలా నేటి యువత ఉండడకూడదని ఒక సీన్ ద్వారా ఇందులో అర్జున్ రెడ్డి చెబుతాడు. అర్జున్ నానమ్మ చనిపోయినప్పుడు అర్జున్ ఆమె ఫేవరెట్ సాంగ్ ప్లే చేస్తాడు. అలా చేస్తే ఆత్మ ప్రశాంతంగా వెళ్లిపోతుంది.
స్వచ్ఛమైన ప్రేమ ప్రేమ స్వచ్ఛంగా ఉండాలి. ప్రీతి కడుపుతో ఉన్నప్పుడు అర్జున్ రెడ్డికి కనిపిస్తుంది. కడుపులో పెరుగుతుంది వేరొకరి బిడ్డ అయినా “నా బిడ్డగా పెరుగుతుంది” అని చెప్తాడు. నిజంగా ప్రేమించడం అంటే అది. చివరికి అది తన బిడ్డే అని తెలుస్తుంది.
వృత్తే దైవం ఆపరేషన్ అర్జెంటు అంటే తన పరిస్థితి బాగా లేకున్నా అర్జున్ రెడ్డి వెళ్తాడు. తర్వాత “డాక్టర్” చదివేటప్పుడు చేసిన ప్రామిస్ గుర్తుతెచ్చుకుంటాడు. నాకు నా లైఫ్ లో నచ్చింది కెరీర్ ఒక్కటే అంటాడు. దీంతో వృత్తే దైవం అని చెప్పకనే చెప్పాడు.