ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా బడ్జెట్ వందకోట్లు దాటనుందా ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలు వందకోట్ల కలక్షన్స్ సాధించడం మొదలై చాలా కాలమైంది. అతని గత చిత్రం జై లవకుశ కూడా 129 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. త్రివిక్రమ్ సినిమాలు కూడా వందకోట్ల మార్క్ ని అవలీలగా దాటాయి. వీరిద్దరి కలయికలో తెరకెక్కనున్న మూవీ వందకోట్ల క్లబ్ లో తక్కువ రోజుల్లోనే చేరడం గ్యారంటీ అని నిర్మాత రాధా కృష్ణ ఫిక్స్ అయ్యారు. అంతేకాదు హీరో, డైరక్టర్ క్రేజ్, ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని భారీగా ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే రఫ్ బడ్జెట్ పరంగా చూస్తే వందకోట్లు అవుతోందని తెలిసింది.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి రెమ్యునరేషన్ 40 కోట్లు, చిత్రంలో నటించే ఇతర ఆర్టిస్టులు, టెక్నీషయన్ల రెమ్యునరేష్ 20 కోట్లు, ప్రొడక్షన్ ఖర్చు 30 కోట్లు అవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే 90 కోట్లు అవుతోంది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పబ్లిసిటీ కి పది కోట్లు దాటిపోతుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన ఎన్టీఆర్ 28 వ మూవీ నిర్మాణ వ్యయం వందకోట్లు దాటుతుందని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. బడ్జెట్ ఈ రేంజ్ లో ఉంటే సినిమా కచ్చితంగా ఉంటే ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ బడ్జెట్ అభిమానులకు సంతోషం కలిగిస్తున్నా.. డిస్ట్రిబ్యూటర్స్ కి గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus