సినిమా పాటలు బాగుంటే.. ఆ సినిమా సంగం హిట్ అయినట్లే అని సినీ పెద్దల నమ్మకం. ఈ విషయం అనేక వందల సినిమాల విషయంలో నిజమైంది కూడా. అందుకే షూటింగ్ మొదలుకాకముందే దర్శకనిర్మాతలు సంగీతంపై దృష్టి పెట్టి మంచి ఆల్బమ్ ని కంపోజ్ చేయించుకుంటారు. అయితే పాటలు సూపర్ హిట్ టాక్ తెచుకున్నప్పటికీ.. హిట్ కాలేకపోయిన సినిమాలు ఉన్నాయి. వాటిలో కొన్ని..
అజ్ఞాతవాసి త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమాకి తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ మంచి ఆల్బం ని ఇచ్చారు. పాటలన్నీ హిట్. అయితే సినిమా మాత్రం విజయ తీరం చేరలేకపోయింది.
తిక్క సాయి ధరమ్ తేజ్ తిక్క మూవీకి థమన్ సూపర్ హిట్ ఆల్బమ్ ఇచ్చారు. ఈ పాటలు విన్న వారందరూ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అనుకున్నారు. కానీ అంచనా తారుమారు అయింది.
ఒక మనసు మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక వెండితెరకు పరిచమైన ఒక మనసు చిత్రానికి సునీల్ కశ్యప్ మనసుకు హత్తుకునే పాటలను ఇచ్చారు. సినిమా మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది.
బసంతి హాస్య బ్రహ్మ తనయుడు గౌతమ్ నటించిన బసంతి సినిమాకి మణిశర్మ అద్భుతమైన పాటలని ఇచ్చారు. యువత హృదయాలకు పాటలు చేరువైనంతగా సినిమా చేరుకోలేదు.
పంజా ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా పవన్ కళ్యాణ్ మూవీ పంజా కి మంచి మెలోడీస్ ఇచ్చారు. ఆ పాటలు వెండితెరపైన కూడా బాగా కనువిందు చేశాయి. సినిమానే అలరించలేకపోయింది.
అందాల రాక్షసి డిఫెరెంట్ లవ్ స్టోరీ అందాల రాక్షసి కి రధన్ ఫీల్ గుడ్ మ్యూజిక్ అందించారు. సినిమానే ప్రేక్షకులకు ఫీల్ ఇవ్వలేకపోయింది.
ఆరంజ్ రామ్ చరణ్, భాస్కర్ కలయికలో తెరకెక్కిన ఆరంజ్ చిత్రానికి హరీష్ జయరాజ్ ఓ రేంజ్ లో పాటలు ఇచ్చారు. కానీ ఆరెంజ్ లో సినిమా లేదు.
ఎందుకంటే ప్రేమంటరామ్, తమన్నా జన్మజన్మ ప్రేమికులుగా నటించిన ఎందుకంటే ప్రేమంట మూవీకి తగినట్టు జీవీ ప్రకాష్ సరికొత్త ట్యూన్స్ తో పాటలను కంపోజ్ చేశారు. సినిమా మాత్రం రికార్డులు క్రియేట్ చేయలేకపోయింది.
మరో చరిత్ర కమల హాసన్ మరో చరిత్ర ఆడియో, సినిమా రెండూ హిట్టే. అయితే వరుణ్ సందేశ్ మరోచరిత్ర ఆడియో హిట్ అయింది కానీ సినిమా ఫ్లాప్ అయింది.
కో అంటే కోటి శర్వానంద్, ప్రియా ఆనంద్ కలిసి నటించిన విభిన్నమైన సినిమా కో అంటే కోటి కి శక్తికాంత్ మధురమైన పాటలను ఇచ్చారు. సినిమా మాత్రం వారం కూడా థియేటర్లో ఉండలేకపోయింది.
వాసు మ్యూజిక్ నేపథ్యంలో సాగె కథతో తెరకెక్కిన వాసు సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్. విక్టరీ వెంకటేష్ ఎంతో కష్టపడి నటించినప్పటికీ వాసు విజయం సాధించలేకపోయింది.