థియేటర్లు రీఓపెన్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న సినిమాలు, అప్పటివరకూ రిలీజ్ అవ్వలేకపోయిన సినిమాలు.. ఇలా బోలెడు సినిమాలు రిలీజ్ కి రెడీ అయిపోయాయి. సంక్రాంతికి పెద్ద సినిమాలు ఉండడంతో చిన్న సినిమాలు పెద్దగా పోటీకి దిగలేదు. అయితే.. ఫిబ్రవరి నుంచి చిన్న సినిమాల హల్ చల్ మొదలైంది. ఫిబ్రవరి మూడో వారం నుంచి ప్రతి శుక్రవారం కనీసం ఏడెనిమిది సినిమాలు విడుదలవ్వడం షరా మామూలు అయిపోయింది. అయితే..
ఈ శుక్రవారం (మార్చి 5) మాత్రం ఏకంగా 11 సినిమాలు విడుదలవుతున్నాయి. సందీప్ కిషన్-లావణ్య త్రిపాఠి జంటగా నటించిన “ఏ1 ఎక్స్ ప్రెస్”, రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన “పవర్ ప్లే”, ప్రయోగాత్మక చిత్రం “పవర్ ప్లే”, దిల్ రాజు బ్యానర్ సమర్పణలో వస్తున్న “షాదీ ముబారక్”, రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషించిన విభిన్నమైన చిత్రం “క్లైమాక్స్”, “A” అనే డిఫరెంట్ థ్రిల్లర్, యాంకర్ రవి హీరోగా నటించిన “తోట బావి”, తారకరత్న ప్రధాన పాత్రలో తెరకెక్కిన “దేవినేని”, శ్రీ పరమానందయ్య శిష్యులు, విక్రమార్కుడు అనేది తమిళ డబ్బింగ్ సినిమా మరియు గజకేసరి అనే కన్నడ డబ్బింగ్ సినిమా,
ఇలా అన్నీ కలిపి ఓ 11 సినిమాలు థియేటర్లో విడుదలవుతుండగా.. “సీత ఆన్ ది రోడ్” అనే మరో తెలుగు సినిమా జీప్లెక్స్ లో ఇదే శుక్రవారం విడుదలవుతోంది. లాక్ డౌన్ కి ముందు కూడా ఒకెరోజులు 10-12 సినిమాలు విడుదలైన రోజులున్నాయి కానీ.. ఇలా లాక్ డౌన్ అనంతరం మళ్ళీ ఒకేరోజు 11 సినిమాలు థియేటర్లో, ఒక సినిమా ఆన్లైన్లో విడుదలవుతుండడం మాత్రం గమనార్హం.