ఊహించనట్టు మెప్పించిన జంటలు

ఈడు జోడు కుదిరితే ఆ జంట చూడడానికి చక్కగా ఉంటుంది. అందుకే ముందు హీరోగా కి తగిన హీరోయిన్ ని ఎంపిక చేయడంలోనే డైరక్టర్ ప్రతిభ దాగుంది. ఇక్కడ ఈడు జోడు మాత్రమే కాదు వారి మధ్య కెమిస్ట్రీ కూడా సెట్ అవ్వాలి. అప్పుడే మూవీ హిట్ అవుతుంది. కానీ ఫలానా హీరో, ఫలానా హీరోయిన్ కలిసి నటిస్తున్నారు అనగానే.. అదేమి కాంబినేషన్ అని పెదవి విరుస్తుంటారు.. అలా ప్రకటనలతో విమర్శలు అందుకున్న కొన్ని జంటలు.. సినిమా రిలీజ్ ఆయిన్ తర్వాత ప్రశంసలు అందుకున్నాయి. అటువంటి ఆన్ స్క్రీన్ హిట్ పెయిర్స్ పై ఫోకస్..

1. బాలకృష్ణ, రాధికా ఆప్టే (లెజెండ్) నటసింహ బాలకృష్ణ పక్కన స్టార్ హీరోయిన్స్, యువ కథానాయికలు నటించి విజయాన్ని అందుకున్నారు. కానీ బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే కి బాలయ్య మధ్య చాలా గ్యాప్ ఉంది. అయినా ఈ జోడి లెజెండ్ సినిమాలో మెప్పించింది.

2. అదితి రావు హైదరి, సుధీర్ బాబు (సమ్మోహనం) అదితి రావు హైదరి, సుధీర్ బాబు కలిసి నటిస్తున్నారు.. అనగానే ఈ సినిమా కూడా పోయినట్టే అని విమర్శించారు. కానీ ఈజంట వెండి తెరపై మెస్మరైజ్ చేసింది.

3. అడివి శేష్, ఆదా శర్మ (క్షణం) ప్రేమ కథా చిత్రాలతో ఆదా శర్మ మంచి ఇమేజ్ సంపాదించుకుంది. కానీ ఎటువంటి ఇమేజ్ లేని అడివి శేష్ తో నటిస్తుంటే.. ఏముంటుందిలే అనుకున్నారు. క్షణం మూవీలో వారిద్దరి ప్రేమ అదుర్స్.

4. అనుష్క, ఉన్ని ముకుందం (భాగమతి)స్టార్ హీరోలతో సినిమాలు చేసే అనుష్క యువ హీరో ఉన్ని ముకుందంతో కలిసి భాగమతి సినిమా చేసింది. వీరిద్దరి కెమిస్ట్రీ కొత్త అనుభూతిని అందించింది.

5. ప్రభాస్, శ్రీదేవి (ఈశ్వర్) ప్రభాస్ పక్కన ఏ హీరోయిన్ అయినా బాగుంటారు. కానీ శ్రీదేవి అనగానే కొంచెం ఆలోచించారు. ఈశ్వర్ మూవీలో ఈ జోడీ చాలా బాగా కనిపించింది.

6. పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ (అజ్ఞాతవాసి) అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్, కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ ల మధ్య రొమాన్స్ పై పెద్దగా అంచనాలు లేవు. కానీ వీరి మధ్య సరదా సన్నివేశాలు, కెమిస్ట్రీ బాగా నచ్చింది.

7. ఆది, నివేతా థామస్ (నిన్ను కోరి) నాని, నివేతా థామస్ ఆన్ స్క్రీన్ సూపర్ ఉన్నారు. కానీ ఆది, నివేతా జోడీ ఎలా ఉంటుందో అని చాలామంది సందేహించారు. కానీ ఆకట్టుకున్నారు.

8. వెంకటేష్, అంజలి (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు)వెంకటేష్, అంజలి కాంబినేషన్ ని ఎవరూ ఊహించలేదు. కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో అద్భుతంగా కెమిస్ట్రీ పండించారు.

9. ప్రభాస్, కంగనా రనౌత్ (ఏక్ నిరంజన్)ఏక్ నిరంజన్ సినిమాలో ప్రభాస్, కంగనా రనౌత్ లు నిజమైన ప్రేమికుల్లా కనిపించారు. అంతలా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ పండింది. ఈ జోడీని సెట్ చేసిన పూరీని చాలా మంది అభినందించారు.

10 . ఎన్టీఆర్, భూమిక (సింహాద్రి)

యాక్షన్ హీరో ఎన్టీఆర్ పక్కన భూమిక ఉంటే ఎలా ఉంటుందో రాజమౌళి ముందు ఊహించి.. వెండితెరపైన చక్కగా ఆవిష్కరించి అనుమానాలను పటాపంచలు చేశారు.

11. కళ్యాణ్ రామ్, తమన్నా (నా నువ్వే) కళ్యాణ్ రామ్ తో తమన్నా అనగానే అందరూ మాస్ హీరో, క్లాస్ హీరోయిన్ సెట్ అవుతుందా? అని సందేహించారు. నా నువ్వే చూసిన తర్వాత బెస్ట్ పెయిర్ అని కితాబు ఇచ్చారు.

12. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్ (మహానటి)నాగ్ అశ్విన్ ఎలా ఊహించారో తెలియదు గానీ కీర్తి సురేష్ కి జోడీగా దుల్కర్ సల్మాన్ పెట్టి మహానటి తీసి హిట్ కొట్టారు. విమర్శకుల నోరు మూయించారు.

ఇలా మిమ్మల్ని సర్ప్రయిజ్ చేసిన జోడీలు మేము మిస్ అయి ఉంటే మీరు కామెంట్ చేయండి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus