ఈ మధ్య కాలంలో ధియేటర్ కు వెళ్ళే జనాల సంఖ్య బాగా తగ్గిపోయింది. అందుకు ప్రధాన కారణం ఓటిటిలే అని నిర్మాతలు చెబుతున్న సంగతి తెలిసిందే. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ప్రతీ వారం ధియేటర్ కు పోటీగా ఓటిటి లో క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ధియేటర్ కంటే కూడా ఎక్కువగా రిలీజ్ అవుతుండడం గమనార్హం. మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లు కొత్త సినిమాలు వీకెండ్ మొత్తం సందడి చేస్తున్నాయి. ఆగస్టు 5 న ఒక్క రోజే 13 సినిమాలు ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) పక్కా కమర్షియల్: గోపీచంద్ హీరోగా రాశీ ఖన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 5 నుండి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది.
2) మహా: స్టార్ హీరోయిన్ హన్సిక కెరీర్లో 50 వ చిత్రంగా రూపొందిన ఈ మూవీ చాలా సైలెంట్ గా ఆగస్టు 5 నుండి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కాబోతుండడం విశేషం.
3) డార్లింగ్స్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కొత్త చిత్రం ‘డార్లింగ్స్’ కూడా ఆగస్టు 5 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
4) ది రైజ్ ఆఫ్ ది టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టిల్స్ : ఈ ఇంగ్లీష్ మూవీ ఆగస్టు 5 నుండీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
5) అలో వీరా : ఈ ఇంగ్లీష్ మూవీ ఆగస్టు 5 నుండీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
6) లాక్ డౌన్ : ఈ ఇంగ్లీష్ మూవీ ఆగస్టు 5 నుండీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
7) నైరోబి : ఈ ఇంగ్లీష్ మూవీ ఆగస్టు 5 నుండీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
8) లిగో స్టార్ వార్స్ సమ్మర్ వెకేషన్ :ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఆగస్టు 5 నుండీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
9) క్రాష్ కోర్స్ : ఈ హిందీ వెబ్ సిరీస్ ఆగస్టు 5 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.
10) కార్టర్ : ఈ కొరియన్ మూవీ ఆగస్టు 5 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
11) ది సాండ్ మెన్: ఈ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ఆగస్టు 5 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
12) థర్టీన్ లైవ్స్ : ఈ హాలీవుడ్ మూవీ ఆగస్టు 5 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానున్నాయి.
13) విక్టిమ్ హు ఈజ్ నెక్స్ట్ : ఈ తమిళ్ మూవీ సోని లివ్ ఆగస్టు 5 నుండీ స్ట్రీమింగ్ కానుంది.