బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో భాగంగా విన్నర్ గా నిలిచినటువంటి పల్లవి ప్రశాంత్ చంచల్ గూడ జైలుకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో విజేతగా నిలిచినటువంటి ఈయన ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లారు అంతేకాకుండా ఈయన అభిమానులు బిగ్ బాస్ కంటెస్టెంట్లపై పెద్ద ఎత్తున రాళ్లదాడి చేశారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సులపై కూడా దాడి చేసే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు.
ఈ విధంగా ప్రశాంత్ అతని అభిమానులు చేసినటువంటి ఈ ఘటన కారణంగా ప్రశాంత్ పై పెద్ద ఎత్తున కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు ర్యాలీ వద్దని చెప్పినప్పటికీ పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లడంతో అభిమానుల మధ్య గొడవ చోటు చేసుకుందని తద్వారా పెద్ద ఎత్తున ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులు నష్టం జరిగాయని పోలీసులు ఈయనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అయితే ఇతనిపై కేసు నమోదు కావడంతో పరారీలో ఉన్నటువంటి ఈయన లాయర్ సూచనల మేరకు తన సొంత గ్రామంలో ఇంటికి చేరుకున్నారు.
పల్లవి ప్రశాంత్ తన ఇంట్లోనే ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకున్నటువంటి జూబ్లీహిల్స్ పోలీసులు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి తనని అలాగే తన తమ్ముడు మనోహర్ అనే వ్యక్తిని కూడా తమ కస్టడిలోకి తీసుకున్నారు. ఈ విధంగా పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వీరిని సుమారు 6 గంటల పాటు విచారించిన అనంతరం జడ్జి గారి ముందు ఆయన ఇంట్లోనే హాజరు పరిచారు.
పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తిని నష్టం చేయడంతో (Pallavi Prashanth) పల్లవి ప్రశాంత్ పై A 1 ముద్దాయిగా కేసు నమోదు అయింది దీంతో లాయర్ వాదన విన్నటువంటి ప్రశాంత్ అలాగే తన తమ్ముడుకి 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పారు. దీంతో పోలీసులు వీరిద్దరిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఇక పల్లవి ప్రశాంత్ అరెస్టు కావడంతో ఆయన అభిమానులు కూడా సైలెంట్ అయ్యారు. అలాగే ఈ ఘటనపై పలువురు స్పందిస్తూ విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు.