మార్చి 2020 కరోనా, లొక్డౌన్ దాటికి థియేటర్స్ అన్ని మూత పడడంతో అందరికంటే ఎక్కువ బాధ పడ్డవారిలో సినిమా అభిమానులు ముందు ఉంటారు. అవును వారానికి ఒకసారి వచ్చే శుక్రవారం రోజు…ఒక మంచి సినిమా చూస్తే కలిగే సంతోషం ఒక్కసారి దూరమైంది అనే బాధ లో ఉన్న వారికీ OTT ప్లాటుఫారం ఒక ఊరటని ఇచ్చింది.
ఈ ఎనిమిది నెలల వ్యవధిలో తెలుగు, తమిళ్, మలయాళం నుండి హిందీ వరకు చాల సినిమాలు OTT లో విడుదల అయితే అందులో చాల వరకు సినిమాలు నిరాశపరిచాయి. ఇందులో కొన్ని సినిమాలు అయితే అబ్బా ఎంత బాగా అనిపించాయి. అలంటి సినిమాల్లో కలర్ ఫోటో అని నేను బల్ల గుద్ది మరి చెప్తాను.
నాని, అనుష్క, కీర్తి సురేష్ లాంటి [పెద్ద సినిమాలు మన తెలుగు ఆడియన్స్ ని నిరాశ పరిస్తే…అస్సలు ఎలాంటి ఎక్సపెక్టషన్స్ లేకుండా, యువ నటులు, టెక్నిషియన్స్, తారాగణం, కథకులు, దర్శకుడు తీసిన ఈ చిన్న సినిమా మన తెలుగు ఆడియెన్సుని నవ్వించింది, కవ్వించింది, అలరించింది చివర్లో అందరి చేత కంట తడి కూడా పెటించింది.
మంచి కథ, నటులు ఉన్న ఈ కోలోరా ఫోటో మూవీలో కొన్ని సంభాషణలూ చూస్తున్నప్పుడు నాకు అయితే గట్టిగా క్లాప్స్ కొట్టి వాహ్ అనాలనిపించింది…