ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

అక్టోబర్ నెలలో రెండు పెద్ద పండుగలు వచ్చాయి. ఒకటి దసరా ఇంకోటి దీపావళి. ఏ పండుగ అయినా పూర్తిగా సంతృప్తిని ఇవ్వాలి అంటే ఆ పండుగలకి మంచి మంచి సినిమాలు రిలీజ్ అవ్వాలి. చెప్పుకోడానికి ఈ రెండు సీజన్లకు మంచి మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘గాడ్ ఫాదర్’ ‘ఘోస్ట్’ ‘స్వాతి ముత్యం’ వంటివి దసరాకి, ‘ఓరి దేవుడా’ ‘ప్రిన్స్’ ‘సర్దార్’ ‘జిన్నా’ వంటివి దీపావళికి రిలీజ్ అవ్వగా.. వీటిలో సక్సెస్ అయిన సినిమా అంటే ‘సర్దార్’ అనే చెప్పాలి. మిగిలినవి పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. అలా అని ‘సర్దార్’ కూడా భారీగా కలెక్ట్ చేయలేదు. ఉన్నవాటిలో అది కొంచెం బెటర్. అయితే ఈ రెండు సీజన్లకు మధ్యలో రిలీజ్ అయిన ‘కాంతార’ చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ పెర్ఫార్మన్స్ ఇస్తూనే ఉంది. ‘థియేటర్లో సినిమా అంటూ చూస్తే ‘కాంతార’ నే చూస్తాం’ అన్నట్టు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో మిగిలిన సినిమాలకు దెబ్బ పడుతుంది. చెప్పుకోడానికి ఈ వీకెండ్ కు కూడా పదుల సంఖ్యలో చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కానీ వీటిపై జనాలకు ఆసక్తి లేదు. కాబట్టి ఈ వీకెండ్ కు కూడా ఓటీటీలే రాజ్యాలు ఏలనున్నాయి. మరి ఈ వీకెండ్ కు ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) నేనే వస్తున్నా : తమిళ్ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన ‘నానే వరువెన్’ తెలుగులో ‘నేనే వస్తున్నా’ గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

2) బర్బరీయాన్ : ఈ హారర్ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

3) మెట్రియార్చ్ : ఈ హారర్ మూవీ కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

4) ఝాన్సీ : అంజలి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ తెలుగు సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

5) బ్లేడ్ ఆఫ్ ది 47 రోనిన్ : ఈ హాలీవుడ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది

6) ది గుడ్ నర్స్ : ఈ హాలీవుడ్ మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

7) దుబాయ్ బ్లింగ్ : నెట్ ఫ్లిక్స్ లో ఈ టీవీ షో స్ట్రీమింగ్ అవుతుంది.

8) బియాండ్ ద యూనివర్స్ : ఈ హాలీవుడ్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

9) మర్డర్ ఇన్ ది కోర్ట్ రూమ్ : ఈ సిరీస్ అక్టోబర్ 28 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

10) ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ : ఈ హాలీవుడ్ మూవీ అక్టోబర్ 28 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

11) ద బాస్టర్డ్ ఆన్ అండ్ ద డెవిల్ హిమ్ సెల్ఫ్ : ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 28 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

12) ఫ్లేమ్స్ : హిందీ సిరీస్ సీజన్ 3 అక్టోబర్ 28 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.

13) అప్పన్ : ఈ మలయాళం మూవీ అక్టోబర్ 28 నుండి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ కానుంది.

14) గంధర్వ : సందీప్ మాధవ్ హీరోగా రూపొందిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది

15) ది బస్టర్డ్ సన్ అండ్ డెవిల్ హిమ్ సెల్ఫ్ : ఈ హాలీవుడ్ మూవీ కూడా అక్టోబర్ 28 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus