Mollywood #MeToo: జస్టిస్‌ హేమ కమిటీ ఎఫెక్ట్‌.. ఇప్పటికి 17 కేసులు నమోదు.. ఇంకా

  • August 29, 2024 / 07:05 PM IST

మలయాళ చిత్ర పరిశ్రమలో తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పటివరకు 17 కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ ఏం జరుగుతోంది అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాలీవుడ్‌లో (Mollywood #MeToo) మహిళల పరిస్థితి ఇదీ అంటూ.. జస్టిస్‌ హేమ కమిటీ నివేదిక తర్వాతనే ఈ పరిస్థితి మొదలైందనే విషయం తెలిసిందే. పరిస్థితి చూస్తుంటే ఈ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. మలయాళ (Mollywood #MeToo) సినీ కళాకారుల సంఘం (అమ్మ) అధ్యక్షుడు మోహన్‌లాల్‌ (Mohanlal) మొదలుకొని మొత్తం సభ్యులు రాజీనామా చేయడంతో ఈ విషయం తీవ్రత అర్థమైన నేపథ్యంలో..

Mollywood’s #MeToo

ఇప్పుడు 17 కేసులు అనేసరికి ఇంకా క్లారిటీ వస్తోంది. జస్టిస్‌ హేమ కమిటీ రిపోర్టు వచ్చిన నేపథ్యంలో ఈ వ్యవహారంలో బాధితులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. పది, పదిహేనేళ్ల క్రితం విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. తాజాగా నటి సోనియా మల్హార్‌ 2013లో తనకు ఓ సినిమా సెట్‌లో ఎదురైన వేధింపుల గురించి మాట్లాడింది. ఒక నటుడు తనను వేధించాడని ఆమె తెలిపారు.

నటుడు జయసూర్య, రాజు, ఇడవేల బాబు లాంటి వాళ్ల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ నటి మిను మునీర్‌ కూడా మీడియా ముందుకొచ్చారు. ఆ విషయం బయపెట్టినప్పటి నుండి తనకు బెదిరింపు సందేశాలు వస్తున్నాయని కూడా చెప్పారామె. ‘అమ్మ’ సంఘంలో చేరడానికి సీపీఎం ఎమ్మెల్యే, నటుడు ముఖేశ్‌ సహాయం కోరగా తన నుంచి ఏదో ఆశించారని మిను ఆరోపించారు.

దీంతో సినిమాల పాలసీలు రూపొందించే ప్యానెల్‌ నుంచి ఆయన్ను సీఎం పినరయి విజయన్‌ తొలగించారు. ఇక మలయాళ నటుడు సిద్ధిఖీపై  (Siddique) అత్యాచార కేసు నమోదైంది. 2016లో సిద్ధిఖీ తనపై Liగిక  వేధింపులకు పాల్పడ్డారని ఓ నటి ఆరోపించారు. ఈ మేరకు మ్యూజియం పోలీసు స్టేషన్‌లో సెక్షన్‌ 376, 506 కింద సిద్ధిఖీ మీద కేసు నమోదైనట్టు పోలీసులు తెలిపారు.

‘ఎమర్జెన్సీ’ కష్టం.. వాళ్లు ఆపుతారు అనుకుంటే.. వీళ్లు ఆపుతున్నారేంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus