రాజు అలా దిల్ రాజు అయ్యాడు..!

కొన్ని సినిమాలు కొందరి జీవితాలలో భారీ మార్పులు తీసుకువస్తాయి. అలాంటి సినిమాల్లో దిల్ ఒకటి. నితిన్ హీరోగా మాస్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన దిల్ మూవీ విడుదలై నేటికి 17ఏళ్ళు. 2003 ఏప్రిల్ 4న ఈ చిత్రం విడుదలైంది. యూత్ ఫుల్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వి వి వినాయక్ అప్పటికే ఎన్టీఆర్ తో ఆది, బాలకృష్ణతో చెన్నకేశవ రెడ్డి సినిమాలు తీశారు. ఆ రెండు మంచి విజయాలు సాధించడంతో వినాయక్ కి పరిశ్రమలో ఓ ఇమేజ్ ఏర్పడింది.

జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నితిన్ కి అది రెండో చిత్రం. జయం సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ తేజ కి మరియు హీరోయిన్ సదాకి ఖాతాలోకి వెళ్ళిపోయింది. కాబట్టి నితిన్ ని హీరోగా నిలబెట్టిన చిత్రం మాత్రం దిల్ నే. ఈ చిత్రం నితిన్ హీరోగా నిలదొక్కుకోవడానికి పునాది వేసింది. ఈ చిత్రం యొక్క మరో గొప్ప తనం డిస్ట్రిబ్యూటర్ రాజుని నిర్మాత దిల్ రాజుని చేసింది. అప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్ గా ఉన్న దిల్ రాజు ఈ చిత్రంతో నిర్మాతగా ఇండస్ట్రీ లోకి అడుగుబెట్టారు.

ఇప్పుడు దిల్ రాజు ఎంత పెద్ద నిర్మాతో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దిల్ లో మెయిన్ విలన్ రోల్ చేసిన ప్రకాష్ రాజ్ తన మార్క్ నటనతో సినిమాకు హైలెట్ గా నిలిచారు. వేణు మాధవ్, ఎల్ బి శ్రీరామ్, ఎంఎస్ నారాయణ ల కామెడీ చక్కగా కుదిరింది. ఆర్ పి పట్నాయక్ సాంగ్ మూవీలో మరో ఆకర్షణ అని చెప్పాలి. ఈ మూవీలో నేహా నితిన్ కి జంటగా నటించింది. ఇలా దిల్ మూవీ నితిన్, దిల్ రాజు, వినాయక్ ల కెరీర్ కి మంచి పునాది వేసింది.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus