‘కార్తికేయ2′ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో నిఖిల్ నటించిన ’18 పేజెస్’ సినిమాపై కాస్త బజ్ ఏర్పడింది. కంటెంట్ కొంచెం కొత్తగా ఉన్నప్పటికీ.. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా సినిమా తీయడంలో దర్శకుడు సూర్య ప్రతాప్ తడబడడంతో బీ,సీ సెంటర్స్ లో సినిమా సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతోంది. నిర్మాతలు మొదటిరోజే సినిమా బ్రేక్ ఈవెన్ అయిందని చెబుతున్నారు. నాన్ థియేట్రికల్ హక్కులు కలిపి మొత్తం పెట్టుబడి వచ్చేసిందనే ఉద్దేశంతో బ్రేక్ ఈవెంట్ అయిందని చెబుతున్నారు.
కానీ అది ట్రేడ్ లెక్కల్లో కౌంట్ అవ్వదు. డిస్ట్రిబ్యూటర్లకు చేసిన బిజినెస్ టికెట్ల రూపంలో వసూలు చేస్తేనే పరిగణలోకి వస్తుంది. సినిమా టాక్ సంగతి పక్కన పెడితే.. రాంగ్ టైంలో రిలీజ్ చేశారనే మాటలు వినిపిస్తున్నాయి. రవితేజ ‘ధమాకా’ సినిమాకి నేరుగా పోటీకి వెళ్లడం మాస్ ఆడియన్స్ పరంగా దెబ్బకొట్టింది. ‘ధమాకా’కి హిట్ టాక్ రానప్పటికీ.. మాస్ ఎలిమెంట్స్ ఉండడం, శ్రీలీల గ్లామర్ బాగా పడింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ‘ధమాకా’ డామినేషన్ కనిపిస్తుంది.
మరోపక్క ’18 పేజెస్’ సినిమాపై జనాలు ఆసక్తి చూపించడం లేదు. వీకెండ్ లోనే సత్తా చాటలేకపోయిన ఈ సినిమా వీక్ డేస్ లో ఏమాత్రం పెర్ఫార్మ్ చేస్తుంది చూడాలి. దీనికి బదులు డిసెంబర్ 30 లేదా 31న సినిమా రిలీజై ఉంటే కొంత బెటర్ గా ఆడేది. సంక్రాంతి సినిమాల సందడి జనవరి 12 నుంచి మొదలవుతుంది కాబట్టి ’18 పేజెస్’ సినిమాకి కలెక్షన్స్ రాబట్టుకోవడానికి కాస్త సమయం కూడా ఉండేది.
అలా కాదని.. ఇప్పుడు ‘ధమాకా’తో క్లాష్ అవ్వడం కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తోంది. ’18 పేజెస్’ గనుక సూపర్ హిట్ అయి ఉంటే నిఖిల్ నెక్స్ట్ పాన్ ఇండియా సినిమా ‘స్పై’కి హెల్ప్ అయ్యేది.