This Weekend Movies: ఈవారం థియేటర్/ఓటీటీలో విడుదల కాబోతున్న 19 సినిమాలు ఇవే..!

ప్రతివారం కొత్త కొత్త సినిమాలు, ఆకట్టుకునే వెబ్ సిరీసులతో థియేటర్లు, ఓటీటీలు సందడి చేస్తూనే ఉన్నాయి.. హాళ్లలో రిలీజ్ అయ్యే అంతటి హడావిడి లేకపోయినా కానీ, బిగ్ స్క్రీన్ మీద సరిగా ఆడని చిత్రాలు కూడా ఓటీటీల్లో బాగా ఆకట్టుకుంటున్నాయి.. ఈ వీక్ ఓటీటీ మరియు థియేటర్లలో విడుదల కానున్న చిత్రాలు, సిరీసుల వివరాలు ఇలా ఉన్నాయి..

మసూద..

సీనియర్ నటి సంగీత, తిరువీర్, బాలనటిగా మెప్పించిన కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన డిఫరెంట్ థ్రిల్లర్ ‘మసూద’.. సాయి కిరణ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నవంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది..

గాలోడు..

కామెడీ స్కిట్స్, టీవీ షోలతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్, గెహన సిప్పి హీరో హీరోయిన్లుగా.. సప్తగిరి, షకలక శంకర్, కీలక పాత్రల్లో యాక్ట్ చేసిన యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘గాలోడు’.. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘గాలోడు’ నవంబర్ 18న విడుదలవుతోంది..

అలిపిరికి అల్లంత దూరంలో..

ఎన్.రావన్ రెడ్డి, శ్రీనికిత, అలంకృతా షా, రవీంద్ర బొమ్మకంటి తదితరులు నటించగా.. ఆనంద్.జె. డైరెక్ట్ చేసిన ‘అలిపిరికి అల్లంత దూరంలో’ చిత్రం నవంబర్ 18న వస్తోంది..

సీతారామపురంలో.. (ఒక ప్రేమ జంట)..

రణధీర్, నందిని రెడ్డి జంటగా.. సీనియర్ నటులు సుమన్, సూర్య ముఖ్య పాత్రల్లో.. వినయ్ బాబు దైరెక్షన్లో రూపొందిన విలేజ్ లవ్ స్టోరీ.. సీతారామపురంలో.. (ఒక ప్రేమ జంట).. నవంబర్ 18నే రానుంది..

దృశ్యం 2..

దృశ్యం సూపర్ సక్సెస్ తర్వాత సీక్వెల్‌గా తెరకెక్కిన ఫ్యామిలీ, సస్పెన్స్ డ్రామా దృశ్యం 2.. అజయ్ దేవ్ గన్, శ్రియ, టబు, అక్షయ్ ఖన్నా నటించగా.. అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించారు. నవంబర్ 18న ఈ చిత్రం బాలీవుడ్‌లో భారీగా రిలీజ్ కానుంది..

ఓటీటీలో రానున్న మూవీస్ అండ్ వెబ్ సిరీస్..

‘అహ నా పెళ్లంట’.. (కనీ..వినీ.. ఎరుగని గోలంట!)

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్ మెయిన్ లీడ్స్‌గా.. సంజీవ్ రెడ్డి డైరెక్షన్లో వస్తున్న వెబ్‌సిరీస్.. ‘అహ నా పెళ్లంట’.. (కనీ..వినీ..ఎరుగని గోలంట!).. జీ5, తమాడా మీడియా ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.. యూత్, ఫ్యామిలీ, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా, మొత్తం 8 ఎపిసోడ్స్ సిరీస్‌గా రూపొందుతున్న ‘అహ నా పెళ్లంట’.. (కనీ..వినీ.. ఎరుగని గోలంట!) నవంబర్ 17 నుండి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.

సర్దార్..

కార్తి, రాశీ ఖన్నా, రజీషా విజయన్, లైలా, చుంకీ పాండే నటించగా సూపర్ హిట్ అయిన స్పై థ్రిల్లర్.. ‘సర్దార్’.. థియేటర్లో మిస్ అయిన ఆడియన్స్ కోసం, పి.ఎస్.మిత్రన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నవంబర్ 18 నుండి ఆహాలో స్ట్రీమింగ్ అవనుంది..

గాడ్ ఫాదర్..

మెగాస్టార్ చిరంజీవి, సత్య దేవ్, నయనతార మెయిన్ లీడ్స్‌గా.. సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటించగా.. ఎ.మోహన్ రాజా దర్శకత్వం వహించిన మాస్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ నవంబర్ 19 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది..

నెట్‌ఫ్లిక్స్‌..

ది వండర్ (హాలీవుడ్) నవంబర్ 16

1899 (హాలీవుడ్) నవంబర్ 17

రిటర్న్ టు క్రిస్మస్ క్రీక్ (హాలీవుడ్) నవంబర్ 17

ఇలైట్ (హాలీవుడ్) నవంబర్ 18

స్లంబర్ ల్యాండ్ (హాలీవుడ్) నవంబర్ 18

అమెజాన్ ప్రైమ్ వీడియో..

హాస్టల్ డేస్ (వెబ్ సిరీస్ – హిందీ) నవంబర్ 16

ది సెక్స్ లైవ్స్ ఆఫ్ కాలేజ్ గర్ల్స్ (వెబ్ సిరీస్) నవంబర్ 18

డిస్నీ+హాట్‌స్టార్

ఇరవతం (తమిళ్/ తెలుగు) నవంబర్ 17

సీతారామం (తమిళ్) నవంబర్ 18

సీనీ లివ్

అనల్ మీలే పని తులి (తమిళ్) నవంబర్ 18

వండర్ ఉమెన్ (తెలుగు) నవంబర్ 18

 

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus