ప్రతీ ఒక్కరి జీవితంలో జయాపజయాలు అనేవి సర్వ సాధారణం. ఇది ఎక్కువగా మన టాలీవుడ్ హీరోలకి కరెక్ట్ గా యాప్ట్ అయ్యే సెంటిమెంట్ అనడంలో సందేహం లేదు. కంటిన్యూగా హిట్లివ్వడం అనేది.. ఏ హీరోకైనా అలాగే ఏ డైరెక్టర్ కి అయినా చాలా కష్టమైనా పనే..! చిరంజీవి, బాలకృష్ణ వంటి వారి నుండీ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వరకూ అందరూ ఓ దశలో వరుస ప్లాపులు ఎదుర్కొని డీలా పడిపోయారు. అలా అని సినిమాలు చేయడం మానేసి కూర్చోలేదు. హిట్టు కొట్టేవరకూ కష్టపడుతూనే వచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలకి వరుస ప్లాపులు పడ్డాయి. ఇక వీరి పని అయిపొయింది అనుకున్న టైములో ఓ పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చి మళ్ళీ ఫామ్లోకి వచ్చిన రోజులున్నాయి. అలా ఓ హిట్టుకి ముందు మన హీరోలు ఫేస్ చేసిన ప్లాపుల లిస్ట్ ఒకసారి చూద్దాం రండి.
1) పవన్ కళ్యాణ్ : ‘ఖుషి’ టు ‘జల్సా’ (5 ప్లాప్ , 1 యావేరేజ్)
‘ఖుషి’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ‘జానీ’ ‘గుడుంబా శంకర్’ ‘బంగారం’ ‘అన్నవరం’ వంటి ప్లాపులు వచ్చాయి. మధ్యలో ‘బాలు’ ఒక్కటి యావరేజ్ గా నిలిచింది. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ‘జల్సా’ తో ప్లాపులకి బ్రేకులు పడ్డాయి.
2) మహేష్ బాబు : ‘ఒక్కడు ‘ టు ‘అతడు’ (2 ప్లాప్ , 1 యావరేజ్)
‘ఒక్కడు’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘నిజం’ ‘నాని’ ప్లాప్స్ పడ్డాయి మహేష్. మధ్యలో ‘అర్జున్’ అనే చిత్రం యావేరేజ్ గా నిలిచింది. మహేష్ కూడా త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన ‘అతడు’ చిత్రంతో ప్లాప్ ల నుండీ బయటపడ్డాడు.
3) పవన్ కళ్యాణ్ : ‘జల్సా’ టు ‘గబ్బర్ సింగ్’ (3 ప్లాప్)
‘జల్సా’ చిత్రంతో హిట్టందుకున్నాడో లేదో.. మళ్ళీ ‘కొమరం పులి’ ‘తీన్ మార్’ ‘పంజా’ వంటి చిత్రాలతో ప్లాప్ లు అందుకున్నాడు పవన్ కళ్యాణ్. తరువాత హరీష్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ తో బ్లాక్ బస్టర్ కొట్టి ప్లాపులకి బ్రేక్ లు వేసాడు.
4) మహేష్ బాబు : ‘పోకిరి’ టు ‘దూకుడు’ (3 ప్లాప్)
‘పోకిరి’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన మహేష్ ఆ తర్వాత ‘సైనికుడు’ ‘అతిధి’ ‘ఖలేజా’ వంటి మూడు ప్లాప్ లు చవి చూసాడు. ఆ తరువాత శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చిన ‘దూకుడు’ తో బ్లాక్ బస్టర్ కొట్టి ప్లాప్ లకి బ్రేక్ లు వేసాడు.
5) నితిన్ : ‘సై’ టు ‘ఇష్క్’ (12 ప్లాప్)
కెరీర్ ప్రారంభంలో ‘జయం’ ‘దిల్’ ‘సై’ వంటి హిట్లందుకున్న నితిన్ ఆ తరువాత ఏకంగా 12 ప్లాప్ లు అందుకున్నాడు. ఇన్ని ప్లాప్ లు పడ్డాక ఏ హీరో అయినా దుకాణం సర్దేయడం ఖాయం అనుకుంటాం..! కానీ ‘ఇష్క్’ చిత్రంతో మళ్ళీ హిట్ కొట్టి ఫామ్లోకి వచ్చేసాడు నితిన్.
6) రవితేజ : ‘మిరపకాయ్’ టు ‘బలుపు’ (5 ప్లాప్)
‘మిరపకాయ్’ తర్వాత ఏకంగా 5 ప్లాప్ లు అందుకున్నాడు రవితేజ. ఆ తరువాత గోపీచంద్ మలినేని డైరెక్షన్లో చేసిన ‘బలుపు’ తో హిట్ కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చేసాడు.
7) ఎన్టీఆర్ : ‘సింహాద్రి’ టు ‘యమదొంగ’ ( 5 ప్లాప్, 1 యావేరేజ్)
‘సింహాద్రి’ వంటి బ్లాక్ బస్టర్ కొట్టిన తరువాత వరుసగా 5 ప్లాప్ లు అందుకున్నాడు ఎన్టీఆర్. మధ్యలో ‘రాఖీ’ చిత్రం యావరేజ్ గా ఆడింది. అయితే రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ‘యమదొంగ’ తోనే హిట్టుకొట్టాడు.
8) నాగ చైతన్య : ‘రారండోయ్ వేడుక చూద్దాం’ టు ‘మజిలీ’ (3 ప్లాప్)
‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన చైతూ.. ఆ తరువాత ‘యుద్ధం శరణం’ ‘శైలజారెడ్డి అల్లుడు’ ‘సవ్యసాచి’ వంటి ప్లాప్ లు అందుకున్నాడు. తిరిగి తన భార్య సమంత తో చేసిన ‘మజిలీ’ చిత్రంతో హిట్టందుకున్నాడు.
9) కళ్యాణ్ రామ్ : ‘అతనొక్కడే’ టు ‘పటాస్’ (7 ప్లాప్)
‘అతనొక్కడే’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్.. ఆ తరువాత 7 ప్లాప్ లు అందుకున్నాడు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేసిన ‘పటాస్’ తో తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యాడు కళ్యాణ్ రామ్.
10) ప్రభాస్ : ‘ఛత్రపతి’ టు ‘డార్లింగ్’ (4 ప్లాప్ , 2 యావేరేజ్)
‘ఛత్రపతి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ‘పౌర్ణమి’ ‘యోగి’ ‘మున్నా’ ‘ఏక్ నిరంజన్’ వంటి ప్లాప్ లు అందుకున్నాడు. మధ్యలో ‘బిల్లా’ ‘బుజ్జిగాడు’ చిత్రాలు యావేరేజ్ గా నిలిచాయి. కరుణాకరన్ డైరెక్షన్లో చేసిన ‘డార్లింగ్’ చిత్రంతో హిట్టందుకుని తిరిగి ఫామ్లోకి వచ్చాడు ప్రభాస్.
11) నాని : ‘ఈగ’ టు ‘భలే భలే మగాడివోయ్'(4 ప్లాప్, 1 యావరేజ్)
‘ఈగ’ సినిమాతో హిట్టందుకున్న నాని ఆ తరువాత ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ ‘పైసా’ ‘ఆహా కళ్యాణం’ ‘జెండా పై కపిరాజు’ వంటి నాలుగు ప్లాప్ లు అందుకున్నాడు. మధ్యలో వచ్చిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రం యావరేజ్ గా నిలిచింది. అయితే మారుతీ డైరెక్షన్లో చేసిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో హిట్టందుకుని ఫామ్లోకి వచ్చాడు నాని.
12) శర్వానంద్ : ‘ప్రస్థానం’ టు ‘రన్ రాజా రన్’ (4 ప్లాప్)
ప్రస్థానం చిత్రంతో మంచి నటుడుగా ప్రూవ్ చేసుకున్న ‘శర్వానంద్’ ఆ తరువాత 4 ప్లాప్ లు అందుకున్నాడు. తరువాత ‘యూవీ క్రియేషన్స్’ బ్యానర్ లో చేసిన ‘రన్ రాజా రన్’ చిత్రంతో హిట్టందుకుని ఫామ్లోకి వచ్చాడు.
13) అల్లు అర్జున్ : ‘పరుగు’ టు ‘జులాయి’ (3 ప్లాప్, 1 యావేరేజ్)
‘పరుగు’ తర్వాత అల్లు అర్జున్ చేసిన ‘ఆర్య2’ ‘వరుడు’ సినిమాలు ప్లాప్ అయ్యాయి.. ఇక ‘వేదం’ యావేరేజ్ గా నిలువగా .. ‘బద్రీనాథ్’ కూడా ప్లాప్ అయ్యింది. ఇక ఈ హీరోకి కూడా త్రివిక్రమ్ ‘జులాయి’ తో హిట్ ఇచ్చి ఆదుకున్నాడు.
14) రాంచరణ్ : ‘నాయక్’ టు ‘రంగస్థలం’ (3 ప్లాప్, 2 యావేరేజ్)
‘నాయక్’ చిత్రంతో ‘తుఫాన్’ ‘గోవిందుడు అందరివాడేలే’ ‘బ్రూస్ లీ’ వంటి సినిమాలు పెద్దగా ఆడలేదు. అయితే ‘ఎవడు’ ‘ధృవ’ చిత్రాలు యావేరేజ్ గా నిలిచాయి. ఇక సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ‘రంగస్థలం’ తో ఏకంగా నాన్- బాహుబలి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు రాంచరణ్.
15) బెల్లంకొండ సాయి శ్రీనివాస్ : ‘అల్లుడు శీను’ టు ‘రాక్షసుడు’ (4 ప్లాప్, 1 యావరేజ్)
మొదటి సినిమా ‘అల్లుడు శీను’ తరువాత ‘స్పీడున్నోడు’ ‘సాక్ష్యం’ ‘కవచం’ ‘సీత’ వంటి సినిమాలు ప్లాప్ అయ్యాయి. ‘జయ జానకి నాయక’ యావరేజ్ గా నిలిచింది. అయితే ‘రాక్షసుడు’ చిత్రంతో హిట్ అందుకుని ఊపిరిపీల్చుకున్నాడు.
16) రానా దగ్గుబాటి : ‘లీడర్’ టు ‘ఘాజి’ (2 ప్లాప్)
రానా దగ్గుబాటి ‘లీడర్’ వంటి హిట్ తర్వాత ‘నేను నా రాక్షసి’ ‘నా ఇష్టం’ వంటి ప్లాప్ లు ఆదుకున్నాడు. ‘కృష్ణం వందే జగద్గురుమ్’ చిత్రం యావేరేజ్ కాగా తిరిగి ‘ఘాజి’ తో హిట్టందుకున్నాడు.
17) చిరంజీవి : ‘చూడాలని ఉంది’ టు ‘ఇంద్ర’ (4 ప్లాప్ , 2 యావరేజ్)
‘చూడాలని ఉంది’ వంటి హిట్ తర్వాత ‘స్నేహం కోసం’ ‘ఇద్దరు మిత్రులు’ ‘మృగరాజు’ ‘శ్రీ మంజునాథ’ వంటి ప్లాప్ లు అందుకున్నాడు. అయితే మళ్ళీ అశ్వినీదత్ నిర్మాణంలోనే చేసిన ‘ఇంద్ర’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఆయన స్టామినా ఏంటనేది చూపించారు మెగాస్టార్.
18) బాలకృష్ణ : ‘లక్ష్మీ నరసింహా’ టు ‘సింహా’ (7 ప్లాప్)
‘లక్ష్మీ నరసింహా’ తరువాత 7 ప్లాప్ లు అందుకున్నాడు బాలయ్య. బోయపాటి శ్రీను డైరెక్షన్లో చేసిన ‘సింహా’ తో బ్లాక్ బస్టర్ కొట్టి హిట్ ట్రాక్ ఎక్కాడు బాలయ్య.
19) వెంకటేష్ : ‘తులసి’ టు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (4 ప్లాప్)
‘తులసి’ వంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ తరువాత ‘చింతకాయల రవి’ ‘ఈనాడు’ ‘నమో వెంకటేశ’ ‘నాగవల్లి’ వంటి ప్లాప్ లు అందుకుని.. మహేష్ తో చేసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తో హిట్టందుకున్నాడు.
20) నాగార్జున : ‘కింగ్’ టు ‘మనం’ (9 ప్లాప్, 3 యావరేజ్)
‘కింగ్’ వంటి కమర్షియల్ హిట్ తర్వాత, 3 యావేరేజ్ సినిమాలు పక్కన పెడితే 9 ప్లాప్ లు ఉన్నాయి. అయితే ‘మనం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్లోకి వచ్చాడు మన ‘కింగ్’..!