Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » “చిరునవ్వుతో” ప్రేక్షకహృదయాలు కొల్లగొట్టి 20 ఏళ్లు!!

“చిరునవ్వుతో” ప్రేక్షకహృదయాలు కొల్లగొట్టి 20 ఏళ్లు!!

  • November 10, 2020 / 11:07 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“చిరునవ్వుతో” ప్రేక్షకహృదయాలు కొల్లగొట్టి 20 ఏళ్లు!!

త్రివిక్రమ్ కథ-మాటలతో జి.రామ్ ప్రసాద్ దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ నిర్మించగా సంచలన విజయం సొంతం చేసుకున్న “చిరునవ్వుతో”. పలు భాషల్లో రీమేక్ కావడం విశేషం!!. సరిగ్గా 20 ఏళ్ల క్రితం చిన్న సినిమాగా విడుదలై చాలా పెద్ద విజయం సాధించిన చిత్రం ‘చిరునవ్వుతో’. తొలిచిత్రం ‘స్వయంవరం’తో నిర్మాతగా ఘన విజయం అందుకున్న శ్యామ్ ప్రసాద్.. జి.రామ్ ప్రసాద్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ… వేణు తొట్టెంపూడి-షహీన్ ఖాన్ జంటగా.. ప్రేమ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 10, 2000లో విడుదలై సంచలన విజయం సాధించింది. రెండు కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించి… నాలుగింతల లాభం ఆర్జించి పెట్టింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించిన కథ-మాటలు ‘చిరునవ్వుతో” సంచలన విజయంలో కీలక పాత్ర పోషించాయి. నిజానికి నేటి స్టార్ కమెడియన్ సునీల్ ఈ చిత్రంతోనే నటుడిగా పరిచయమయ్యారు. కాకపోతే… తను నటించిన ‘నువ్వేకావాలి’ ముందు విడుదలైంది. ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, గిరిబాబు, చంద్రమోహన్, సుధ, ఎం.ఎస్.నారాయణ ముఖ్య తారాగణంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి రివార్డులతోపాటు.. అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏకంగా నాలుగు నందులు గెలుచుకుంది.

బెస్ట్ డైలాగ్ రైటర్ గా త్రివిక్రమ్, బెస్ట్ ప్రొడ్యూసర్ గా శ్యామ్ ప్రసాద్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా జి.రామ్ ప్రసాద్ కు అవార్డులు తెచ్చిపెట్టిడంతో పాటు.. బెస్ట్ ఫిల్మ్ అవార్డు కూడా కైవసం చేసుకుంది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా మణిశర్మకు ఫిల్మ్ ఫేర్ పురస్కారం దక్కింది. హైద్రాబాద్ సుదర్శన్ లో ఏకంగా 175 రోజులు ప్రదర్శించబడి చరిత్ర సృష్టించిన ‘చిరునవ్వుతో’… హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ చేయబడడం విశేషం. తమిళంలో హీరో విజయ్ నటించగా… ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించారు. కన్నడలో రవిచంద్రన్ హీరోగా అశ్వినీదత్ ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. ఈ రెండు రీమేక్స్ లోనూ షాహీన్ హీరోయిన్ కావడం గమనార్హం. “చిరునవ్వుతో” తన కెరీర్ కి సుస్థిరమైన పునాది వేసుకున్న జి.రామ్ ప్రసాద్.. ఆ తరువాత.. “కళ్యాణరాముడు, ఖుషీ ఖుషీగా, సీమసింహం, నా స్టయిలే వేరు” వంటి పలు చిత్రాలు తెరకెక్కించి ప్రముఖ దర్శకుల జాబితాలో చేరిపోయారు. హీరో వేణు తొట్టెంపూడి కెరీర్ లో ఈ చిత్రం ఓ కలికితురాయిగా నిలిచిపోయింది!!!!

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmanandam
  • #Chirunavvutho Movie
  • #G. Ram Prasad
  • #Shahin
  • #Shyam Prasad

Also Read

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

Cult Teaser: ‘కల్ట్’ టీజర్ రివ్యూ.. మరో ‘స్క్విడ్ గేమ్’ లా ఉందిగా

related news

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

Suriya – Venky: సూర్య కొత్త సినిమా పేరు ఇదేనా? రెండు చోట్లా ఇబ్బంది లేకుండా?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Aadarsha Kutumbam: టీమ్‌ని మార్చేస్తున్న త్రివిక్రమ్‌.. వెంకటేశ్‌ సినిమా అనుకున్న టైమ్‌కి అవుతుందా?

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

Aadarsha Kutumbam AK 47 : దసరాకే ‘ఆదర్శ కుటుంబం- AK47’ కూడా?

trending news

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

Filmfare 2027: ఫిల్మ్ ఫేర్‌ సౌత్‌ అవార్డులు… ఏ అవార్డు ఎవరికి వచ్చిందంటే?

4 hours ago
Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

Mowgli: సినిమా పోయింది.. అయినా ఈ కెలుకుడు అవసరమా సరోజ్

21 hours ago
Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

Hey Balwanth: జస్ట్ ఓకే అనిపించిన ‘హే బల్ వంత్’ ఫస్ట్ డే ఓపెనింగ్స్

21 hours ago
Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

Ravi Basrur: రవి బసృర్ పేరు వెనుక ఇంత కథ ఉందా.. ‘రెండు సార్లు చనిపోవాలనుకున్నానంటూ’

23 hours ago
Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

Cult: సంగీత దర్శకుడికి రోలెక్స్ గోల్డ్ వాచ్ బహుకరించిన విశ్వక్ సేన్

1 day ago

latest news

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

2 hours ago
Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

Kamal Haasan, Rajinikanth: లేనిపోని చర్చ ఎందుకు బ్రో… KHxRK సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చుగా..

2 hours ago
Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

3 hours ago
Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

Sivaji: మూడు రోజులు నిద్రపోలేదు: శివాజీ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

Sai Madhav Burra: ఆయన సినిమా మధ్యలో వదిలేశారు.. వీళ్లు ఫోన్లు ఎత్తడం లేదు!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version