2003 వ సంవత్సరం ఏప్రిల్ 19న విడుదలైంది ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రం. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకుడు. నేటితో ఈ చిత్రం విడుదలై 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియాలో ‘#20YearsForAmmaNannaOTamilaAmmayi’ అనే హ్యాష్ ట్యాగ్ ఓ రేంజ్లో ట్రెండ్ అవుతుంది. ఈ సందర్భంగా ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రం గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం :
1) నిజానికి ఈ ప్రాజెక్ట్ మొదట ‘రోజాపూలు’ హీరో శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ తో అనౌన్స్ చేశాడు పూరి. శ్రీరామ్ తెలుగులో చేసిన ‘ఒకరికి ఒకరు’ చిత్రానికి పనిచేసిన రైటర్ కోన వెంకట్ ఈ కాంబోని సెట్ చేశారు. అయితే కారణాలేంటో తెలీదు ఈ కాంబో సెట్ అవ్వలేదు.
2) కొన్నాళ్ల తర్వాత పూరి.. ఈ కథను డెవలప్ చేసుకుని పవన్ కళ్యాణ్ ని కలిశాడు. అయితే పవన్ కళ్యాణ్.. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే.అలాగే ఈ సినిమా టైటిల్ కు, ఇందులో ఉన్న ఎమోషనల్ కంటెంట్ కు తన ఇమేజ్ మ్యాచ్ అవ్వకపోవచ్చు అని భావించి పవన్ ఈ సినిమాని రిజెక్ట్ చేయడం జరిగింది.అంతేకాకుండా మరోపక్క పవన్ ‘జానీ’ అనే కిక్ బాక్సింగ్ కథతో మరో మూవీ చేస్తుండటం దానికి ఆయనే దర్శకుడు కావడంతో కూడా ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రాన్ని ఆయన వద్దనుకున్నారు.
3) పవన్ నో చెప్పడంతో (Raviteja) రవితేజ ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈ కాంబోలో ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ ‘ఇడియట్’ వంటి సూపర్ హిట్లు పడటంతో ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ క్రేజీ ప్రాజెక్టుగా మారింది.
4) మలయాళ అమ్మాయి అసిన్ ను తీసుకొచ్చి తమిళ అమ్మాయిని చేశాడు పూరి. అయితే టైటిల్ వరకు, చిన్న లవ్ ట్రాక్ వరకు తప్ప ఈ మూవీలో ఆమె పాత్ర పెద్ద లెంగ్త్ ఉండదు. అయినా ఆమెకు ఈ మూవీ బాగా కలిసొచ్చింది. తర్వాత బోలెడన్ని ఆఫర్లు వచ్చాయి. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
5) అమ్మ పాత్రకు ముందు ఎంతో మంది హీరోయిన్లను అనుకున్నాడు పూరి. బాలీవుడ్ నుండి సీనియర్ హీరోయిన్లను దింపాలనుకున్నాడట. ఫైనల్ గా జయసుధ ని ఎంపిక చేసుకున్నాడు. ఈ మూవీకి ఆమె హార్ట్ అండ్ సోల్.
6) సంగీత దర్శకుడిగా మొదట రమణ గోగుల, సందీప్ చౌత ని అనుకున్నారు. ఫైనల్ గా చక్రితోనే మ్యూజిక్ చేయించుకున్నారు.
7) ఎంత ఎమోషనల్ సినిమా అయినా అలీ, కాదంబరి,ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి కమెడియన్లతో ఫుల్ కామెడీ పండించాడు పూరి.
8) 73 రోజుల్లోనే పూరి సినిమాని కంప్లీట్ చేసి.. 2003 సమ్మర్ కు అంటే ఏప్రిల్ 19 కి రిలీజ్ చేశాడు. మొదటి షోతోనే సినిమా సూపర్ హిట్ అయ్యింది. హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అన్ని ఏరియాల్లో దుమ్ము దులిపేసింది ఈ మూవీ.
9) సరిగ్గా ఈ సినిమా రిలీజ్ అయిన 6 రోజులకి అంటే ఏప్రిల్ 25న పవన్ కళ్యాణ్ ‘జానీ’ సినిమా రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యింది.
10) రవితేజ- పూరి కాంబోలో హ్యాట్రిక్ కంప్లీట్ అయ్యింది. ఫుల్ రన్లో ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.17 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది. 55 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులు ఆడింది ఈ మూవీ.