2016 ఫిల్మీ ఫోకస్ సినీ అవార్డ్స్

  • March 15, 2017 / 12:36 PM IST

నంది అవార్డ్స్, ఫిలిం ఫేర్ అవార్డ్స్, సైమా అవార్డ్స్, ఐఫా అవార్డ్స్, మా టీవీ అవార్డ్స్, సంతోషం అవార్డ్స్ .. ఇన్ని అవార్డ్స్ ఉన్నాయి కదా.. ఇంకోటి ఉంటే తప్పు ఏంటి చెప్పండి. 2012 లో వచ్చిన సినిమాలకు ఇప్పడు అవార్డ్స్ ఇచ్చారు. మనం అలా కాకుండా ఏ ఏడాదికి ఆ ఏడాది తాజాగా, సరదాకి అవార్డ్స్ ఇస్తే ఎలా ఉంటుంది. మీ అభిప్రాయాలూ మీకు ఉంటాయి.. అనుకోండి. మేము (ఫిల్మీ ఫోకస్) మాత్రం కొంతమందిని సెలక్ట్ చేసాము. ఎవరెవరికి వచ్చాయో మీరే తెలుసుకోండి. ఆ వివరాలు..

ఉత్తమ చిత్రం : ఊపిరి
ఉత్తమ విజయవంతమైన మూవీ : జనతా గ్యారేజ్
ఉత్తమ జనరంజకమైన చిత్రం : పెళ్లిచూపులు
ఉత్తమ నటుడు : ఎన్టీఆర్ (జనతా గ్యారేజ్)
ఉత్తమ నటి : సమంత (అ..ఆ)
ఉత్తమ దర్శకుడు : చంద్రశేఖర్ యేలేటి (మనమంతా)
ఉత్తమ విలన్ : అరవింద్ స్వామి (ధృవ)
ఉత్తమ సహాయ నటుడు : మోహన్ లాల్ (జనతా గ్యారేజ్ )
ఉత్తమ సహాయ నటి : గౌతమి (మనమంతా)
ఉత్తమ హాస్యనటుడు : ప్రియదర్శి ( పెళ్లిచూపులు)
ఉత్తమ తొలి చిత్రం దర్శకుడు : తరుణ్ భాస్కర్ ( పెళ్లిచూపులు)
ఉత్తమ నటుడు (తొలి పరిచయం) : విజయ దేవరకొండ ( పెళ్లిచూపులు)
ఉత్తమ నటి (తొలి పరిచయం) : మెహెరీన్ (కృష్ణగాడి వీర ప్రేమ గాధ), నందిత శ్వేతా (ఎక్కడికి పోతావు చిన్నవాడా )
ఉత్తమ కథ : మనమంతా
ఉత్తమ స్క్రీన్ ప్లే : అడవి శేషు (క్షణం)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : పీఎస్ వినోద్ (ధృవ)
ఉత్తమ ఫైట్ మాస్టర్ : రామ్ లక్ష్మణ్ (సరైనోడు)
ఉత్తమ రీరికార్డింగ్ : హిప్ హాప్ తమిజా (ధృవ)
ఉత్తమ మాటల రచయిత : కిషోర్ తిరుమల (నేను శైలజ)
ఉత్తమ సంగీత దర్శకుడు : దేవి శ్రీ ప్రసాద్ ( నేను శైలజ)
ఉత్తమ పాట : నాన్నకు ప్రేమతో ( నాన్నకు ప్రేమతో)
ఉత్తమ ఎడిటింగ్ : అర్జున్ శాస్త్రి (క్షణం)
ఉత్తమ పబ్లిసిటీ డిజైన్ : అనిల్ & భాను (క్షణం)


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus