పాల మీగడ లాంటి స్కిన్ టోన్ తో, తేనేకళ్లతో చూడగానే పక్కింటి అమ్మాయిలా కనిపించే మెహ్రీన్ తొలి సినిమా సక్సెస్ తో కెరీర్ జెట్ స్పీడులా దూసుకెళుతుందని విశ్లేషకులు భావించారు. కానీ సీన్ కట్ చేస్తే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే సూత్రాన్ని ఫాలో అయ్యింది మెహ్రీన్. ఎవరు కథ చెప్పినా కాదనకుండా సినిమాలు చేసేయడంతో ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఐరన్ లెగ్ అయి కూర్చొంది. కృష్ణగాడి వీరప్రేమగాథ తర్వాత మెహ్రీన్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొల్తాకొట్టాయి. మధ్యలో మహానుభావుడు వచ్చినా అది కళ్ళ నీళ్లు తుడవటానికే సరిపోయింది. ఎవరు తీసుకోకపోవడంతో ఇక మెహ్రీన్ కథ ముగిసినట్లేనని అందరూ భావించారు. అయితే 2018లో ఈ బొద్దుగుమ్మకి అదృష్టం కలిసొచ్చి మూడు సినిమాల్లో అవకాశం దొరికింది. కానీ అవన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
2018లో గోపిచంద్ హీరోగా వచ్చిన పంతం సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆ తర్వాత సూపర్ ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ తనను గట్టెక్కిస్తాడని అనుకుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన నోటా కూడా మెహ్రీన్ ట్రాక్ రికార్డును మార్చలేకపోయింది. ఇక ఏడాది చివర్లో వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కవచం కూడా ఫ్లాపయ్యింది. మొత్తానికి ఫ్లాపులతో 2018ని ప్రారంభించిన మెహ్రీన్.. ఫ్లాప్ తోనే ఈ ఏడాదికి వీడ్కోలు చెప్పింది. వచ్చే ఏడాదైనా ఈ అమ్మడికి లక కలిసొస్తుందేమో చూడాలి.