ఆ స్టార్ హీరోలకు సక్సెస్ దక్కడం సాధ్యమేనా?

2022 సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో యంగ్ జనరేషన్ స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే. అయితే 2022 సంవత్సరం సెకాండాఫ్ లో సీనియర్ హీరోలదే హవా కావడం గమనార్హం. ఈ ఏడాది విడుదలైన సినిమాలలో బాక్సాఫీస్ వద్ద హిట్టైన సినిమాలతో పోల్చి చూస్తే ఫ్లాపైన సినిమాలు ఎక్కువ కావడం గమనార్హం.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ షూటింగ్ ఇప్పటికే దాదాపుగా పూర్తైంది. ఈ నెల 4వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ రిలీజయ్యే అవకాశం ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. దసరా కానుకగా గాడ్ ఫాదర్ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. సెప్టెంబర్ నెల 9వ తేదీన నాగ్ కీలక పాత్రలో నటించిన బ్రహ్మాస్త్రం పార్ట్1 విడుదల కానుందనే సంగతి తెలిసిందే. నాగార్జున ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ది ఘోస్ట్ సినిమా కూడా ఈ ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ కానుంది.

బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ కుదిరితే దసరా కుదరని పక్షంలో డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. సల్మాన్ ఖాన్, వెంకటేష్ కాంబోలో క‌భీ ఈద్ క‌భీ దివాళి పేరుతో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ ఏడాది చివరి వారంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. టాలీవుడ్ సీనియర్ హీరోలైన నలుగురు హీరోలు ఈ ఏడాది సెకండాఫ్ లో లక్ ను పరీక్షించుకుంటున్నారు.

ఈ హీరోలలో ఎవరెవరికి సక్సెస్ దక్కుతుందో చూడాల్సి ఉంది. ఈ స్టార్ హీరోల సినిమాలన్నీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది. యంగ్ జనరేషన్ స్టార్ హీరోల సినిమాలు మాత్రం ఈ ఏడాది రిలీజయ్యే అవకాశం అయితే లేదని తెలుస్తోంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus