ఈ ఏడాది సక్సెస్ ను సొంతం చేసుకున్న హీరోయిన్లు వీళ్లే!

2022 సంవత్సరానికి గుడ్ బై చెప్పి 2023 సంవత్సరానికి వెల్ కం చెప్పడానికి మరో 17 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ ఏడాది సినిమా రంగానికి మిక్స్డ్ ఫలితాలు వచ్చాయి. కొన్ని సినిమాలు అంచనాలకు మించి సక్సెస్ అయితే మరికొన్ని సినిమాలు మాత్రం అంచనాలను అందుకోలేక నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. ఈ ఏడాది ఎంతోమంది హీరోయిన్లు తెలుగు సినిమాలలో నటించి తమ లక్ ను పరీక్షించుకున్నారు.

కొంతమంది యంగ్ హీరోయిన్లు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంటే మరి కొందరు స్టార్ హీరోయిన్లు అంచనాలను అందుకోలేక తడబడ్డారు. మరి కొందరు హీరోయిన్లు మాత్రం ఈ ఏడాది ఒక్క సినిమాలో కూడా కనిపించకపోవడంతో అభిమానులు తెగ ఫీలయ్యారు. ఈ ఏడాది అనుష్క నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. కాజల్, శృతి హాసన్ నటించిన సినిమాలు కూడా ఈ ఏడాది థియేటర్లలో విడుదల కాలేదు.

స్టార్ హీరోయిన్ సమంత యశోద సినిమాతో లక్ ను పరీక్షించుకోగా ఈ సినిమాతో ఆమె ఖాతాలో యావరేజ్ మూవీ చేరింది. ఎఫ్3 మినహా తమన్నాకు మరే సక్సెస్ దక్కలేదు. పూజా హెగ్డే ఈ ఏడాది స్టార్స్ సినిమాల్లో నటించినా ఆ సినిమాలన్నీ నిర్మాతలకు నష్టాలను మిగిల్చి పూజా హెగ్డే ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. స్టార్ హీరోయిన్ రష్మిక మాత్రం ఈ ఏడాది కూడా హవా చూపించారు.

సీతారామం మూవీ సక్సెస్ రష్మిక కెరీర్ కు ఒకింత ప్లస్ అయింది. కృతి శెట్టికి కొన్ని సినిమాల ఫలితాలు షాకిచ్చినా బంగార్రాజు సినిమా సక్సెస్ తో ఆమె కెరీర్ పుంజుకుంది. విరాటపర్వం, గార్గి కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా నటిగా సాయిపల్లవి స్థాయిని పెంచాయి. సర్కారు వారి పాట సినిమాతో కీర్తి సురేష్ ఖాతాలో సక్సెస్ చేరింది.

రష్మిక, కృతిశెట్టి, కీర్తి సురేష్ లకు ఈ ఏడాది దశ తిరిగిందని మిగతా హీరోయిన్లకు మాత్రం ఈ ఏడాది కలిసిరాలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అలియా భట్, శ్రీనిధి శెట్టి, సప్తమి గౌడ టాలీవుడ్ ప్రేక్షకులను తమ నటనతో ఆకట్టుకుని దగ్గరయ్యారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus