2023 సంక్రాంతికి ఏమవుతుందో ఓసారి ఊహిద్దామా!

టాలీవుడ్‌ – సంక్రాంతి ఈ కాంబినేషన్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏటా ఈ కాంబో కోసం పాన్‌ ఇండియా సినిమాలను మించి వెయిట్‌ చేస్తుంటారు సినిమా ప్రేమికులు. అలా వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాల ముచ్చట గురించి మాట్లాడుకుందామా? ఏంటి మరీ పది నెలల ముందా అనుకుంటున్నారా? అసలు 2023 సంక్రాంతికి ఏ సినిమా రెడీ అవుతున్నాయో తెలిస్తే… మేం ముందుగా మాట్లాడటం సరైనదే అని మీరు కచ్చితంగా అంటారు.

అవును, వచ్చే సంక్రాంతి టాలీవుడ్‌లో మామూలుగా ఉండటం లేదు. టాలీవుడ్‌ అగ్ర హీరోలు ముగ్గురు పొంగల్‌ ఫైట్‌కి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 2023 పొంగల్‌ విల్‌ బీ మోర్‌ పవర్‌ఫుల్‌ అంటున్నారు. ప్రభాస్‌ – ఓం రౌత్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆది పురుష్‌’ సినిమా డేట్‌ను ఇటీవల చిత్రబృందం ప్రకటించింది. దీంతోనే ఈ చర్చ మొదలైంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేస్తున్నారు.

ఇప్పటికే మరికొన్ని సినిమాలు వచ్చే సంక్రాంతి రేసులో ఉన్నాయి. అఫీషియల్‌ వాళ్లు ప్రకటించకపోయినా సంక్రాంతి సీజన్‌కే ఆ సినిమా వస్తాయని టాక్‌. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే శంకర్‌ – రామ్‌చరణ్‌ – దిల్‌ రాజు కాంబినేషన్‌ రూపొందుతున్న ప్రెస్టీజియస్‌ సినిమాను సంక్రాంతికే విడుదల చేద్దాం అనుకుంటున్నారట. దిల్‌ రాజు సంక్రాంతి సెంటిమెంట్‌, సీజన్‌ క్యాష్‌ చేసుకోవాలి అనుకోవడమే దీనికి కారణం. ఈ లెక్కన రెండు పాన్‌ ఇండియా సినిమాలు సంక్రాంతికే వస్తున్నాయి.

వీటితోపాటు మరో సినిమాలు సంక్రాంతి సీజన్‌ మీద కన్నేశాయి. అందులో ఒకటి మహేష్‌బాబు – త్రివిక్రమ్‌ సినిమా. ఈ సినిమా చిత్రీకరణను ఏప్రిల్‌లో ప్రారంభిస్తారని సమాచారం. అంటే ఎనిమిది నెలల్లో సినిమా పనులన్నీ పూర్తి చేసి విడుదల చేయాలని చిత్రబృందం చూస్తోంది. ఇక బాలకృష్ణ – గోపీచంద్‌ మలినేని సినిమాను కూడా అప్పుడే తీసుకొస్తారని అంటున్నారు. దీంతో వచ్చే సంక్రాంతికి బాగా బిజీగా మారిపోయింది. అలాగే ఇంట్రెస్టింగ్‌గా మారిపోయింది.

గమనిక: ఇందులో ఎన్ని సంక్రాంతి బరిలో ఉంటాయి అనేది మనం ఇప్పుడే చెప్పలేం. అలాగే కొత్త సినిమాలు ఈ లైన్‌లోకి రావు అని కూడా అనలేం. ఇప్పటివరకు అయితే నాలుగు సినిమాలు రెడీ.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus