సంక్రాంతి సినిమాల బుకింగ్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

2023 సంక్రాంతి పండుగ కానుకగా విడుదలవుతున్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలకు సంబంధించి కొన్ని ఏరియాలలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. బాలయ్య, చిరంజీవి అభిమానులు ఈ సినిమాలకు ఫస్ట్ డే టికెట్లను బుకింగ్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ లో కొన్ని థియేటర్లకు ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్ మొదలు కాగా ఈ సినిమాకు క్రేజ్ ఉన్న థియేటర్లలో ఫస్ట్ డే టికెట్లు దొరకడం కష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి. రెండు సినిమాలు బుకింగ్స్ విషయంలో జోరు చూపిస్తుండటం గమనార్హం.

ఫస్ట్ డే ఈ రెండు సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ కావడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వారసుడు సినిమాకు మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా మొదలుకాలేదు. 14వ తేదీన వారసుడు, కళ్యాణం కమనీయం సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. సంక్రాంతి సినిమాల బుకింగ్స్ బాగుండటంతో ఫ్యాన్స్ సైతం హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ రెండు సినిమాల కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

చిరంజీవి, రవితేజ కలిసి నటించడం వాల్తేరు వీరయ్యకు ప్లస్ అయింది. రెండు సినిమాలలో శృతి హాసన్ హీరోయిన్ గా ఏ సినిమాలో శృతి హాసన్ పాత్ర హైలెట్ గా నిలుస్తుందో అనే కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం. వాల్తేరు వీరయ్య ట్రైలర్ కు ఇప్పటివరకు 15 మిలియన్ల వ్యూస్ రాగా వీరసింహారెడ్డి ట్రైలర్ కు 14 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. తాజాగా వీరసింహారెడ్డి సినిమా నుంచి విడుదలైన మాస్ మొగుడొచ్చాడే సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సంక్రాంతికి విడుదలవుతున్న రెండు సినిమాలు ఘన విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. సంక్రాంతి సినిమాలు నిర్మాతలకు భారీ లాభాలను అందించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus