పెద్ద సినిమాలు సంక్రాంతిపై దృష్టి పెట్టడం వెనుక అసలు లెక్కలివేనా?

  • January 17, 2024 / 01:48 PM IST

ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా ఎక్కువ సంఖ్యలో సినిమాలు విడుదలవుతున్నాయి. సంక్రాంతి కానుకగా సినిమాలను విడుదల చేస్తే తక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదలైనా సులువుగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పెద్ద సినిమాలు సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైతే మంచి లాభాలను అందిస్తుండటం గమనార్హం. సంక్రాంతికి విడుదలైన సినిమాలు యావరేజ్ టాక్ తో సైతం సైతం బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తాయి. 2024 సంక్రాంతిలా 2025 సంక్రాంతి పండుగకు కూడా గట్టి పోటీ ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

చిరంజీవి వశిష్ట కాంబో మూవీ, శతమానం భవతి నెక్స్ట్ పేజ్ సినిమాలు ఇప్పటికే సంక్రాంతి రేసులో ఉండగా త్వరలో మరికొన్ని సినిమాలు ఈ జాబితాలో చేరే ఛాన్స్ అయితే ఉంది. సంక్రాంతి పండుగ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వీక్ డేస్ లో సైతం భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తాయి. కంటెంట్ అద్భుతంగా ఉంటే చిన్న సినిమాలు సైతం సంక్రాంతికి విడుదలై సంచలన విజయాలను సొంతం చేసుకుంటాయని ఇప్పటికే చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది.

2025 సంక్రాంతి రేసులో మరికొన్ని సినిమాల పేర్లు వినిపిస్తున్నా అధికారిక ప్రకటన రాకుండా ఆ సినిమాల గురించి చర్చించడం కరెక్ట్ కాదు. ప్రభాస్ మారుతి కాంబో మూవీ ఈ ఏడాది డిసెంబర్ లో థియేటర్లలో విడుదల కానుందని సమాచారం. 2025 సంక్రాంతికి థియేటర్ల విషయంలో సైతం గట్టి పోటీ ఉండనుందని తెలుస్తోంది.

ఈ సినిమాలలో ఎన్ని సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేస్తాయో చూడాలి. (Chiranjeevi) చిరంజీవి వశిష్ట కాంబో మూవీ 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. చిరంజీవి వశిష్ట కాంబో మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus