సుమన్ హీరోగా మాంచి ఫామ్‌లో ఉన్న టైంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘ఏవండి పెళ్లి చేసుకోండి!’.. రమ్యకృష్ణ కథానాయిక. వినీత్, రాశీ ప్రముఖ పాత్రల్లో నటించారు. శరత్ దర్శకత్వంలో.. ఎడిటర్ మోహన్ సమర్పణలో, ఎమ్.ఎల్.మూవీ ఆర్ట్స్ బ్యానర్ మీద ఆయన భార్య ఎమ్.వి.లక్ష్మీ నిర్మించారు. 21 నవంబర్ 1997న విడుదలైన ఈ చిత్రం 2022 నవంబర్ 21 నాటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించిన విశేషాలేంటో చూద్దాం..
ఎడిటింగ్ మీద ఎంతో పట్టున్న మోహన్ నిర్మాతగా మారి పలు కుటుంబ కథా చిత్రాలు తీసి ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌గా ప్రూవ్ చేసుకున్నారు. అప్పటికే కృష్ణంరాజు, సుమన్‌లతో ‘బావ బావమరిది’ అనే సూపర్ హిట్ పిక్చర్ తీశారు. అలాంటి ప్రేక్షకాదరణ కోసం డిఫరెంట్ కథాంశంతో ‘ఏవండీ.. పెళ్లి చేసుకోండి’ తీద్దామని సుమన్, రమ్యకృష్ణలను ప్రధాన పాత్రలకు తీసుకున్నారు. మొదట ఈ సినిమాకి ‘ఏవండి.. మళ్లీ పెళ్లి చేసుకోండి’ అనే టైటిల్ పెట్టారు. నెగిటివ్‌గా ఉంటుందని ‘ఏవండి.. పెళ్లి చేసుకోండి!’ గా ఫిక్స్ చేశారు.
ప్రేక్షకుల నుండి మంచి స్పందన..
ఊహించినట్టుగానే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. మన జీవితంలో అనుకోకుండా జరిగే సంఘటనలనే తెరమీద చూపించడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. నటీనటుల ప్రతిభ సినిమాకు ప్లస్ అయింది. కోటీ సంగీతమందించిన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి.. అన్ని ముఖ్యకేంద్రాల్లో అర్థ, శతదినోత్సవం జరుపుకుంది. కోట, కైకాల, బాబూ మోహన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
చిరు ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్ సహ నిర్మాత..
ఈ సినిమాకి సహ నిర్మాతగా ఎమ్.రాజా పేరు పడుతుంది. అతనెవరో కాదు. ఎడిటర్ మోహన్ పెద్ద కుమారుడు. తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని తెరకెక్కించింది రాజానే. రామ్ చరణ్ ‘ధృవ’ ని ముందుగా తమిళ్‌లో తన తమ్ముడు ‘జయం’ రవి హీరోగా తీసి సూపర్ హిట్ కొట్టాడు. ఎమ్.ఎల్.మూవీ ఆర్ట్స్ బ్యానర్‌లో రూపొందిన ‘ఏవండి.. పెళ్లి చేసుకోండి!’ ఫ్యామిలీ అండ్ మ్యూజికల్ హిట్ ఫిలింగా నిలిచింది.
ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!
మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!