3 BHK Collections: ‘3 BHK’ కి ఇక ఛాన్స్ లేనట్టే..!

సిద్ధార్థ్ (Siddharth) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘3 BHK‘ చిత్రం గత వారం అంటే జూలై 4న రిలీజ్ అయ్యింది. శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శరత్ కుమార్, దేవయాని వంటి స్టార్స్ కూడా నటించారు.అరుణ్ విశ్వ ఈ చిత్రాన్ని నిర్మించారు. సొంతింటి ఇల్లు కొనుక్కోవాలని ఆశపడ్డ ఓ కుటుంబం.. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు పడ్డ కష్టాలు నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. టీజర్, ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడానికి కారణం రిలేటెడ్ కాన్సెప్ట్ అనే చెప్పాలి.

3 BHK Collections

రిలీజ్ రోజున పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. జస్ట్ యావరేజ్ గానే వచ్చాయి. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.62 cr
సీడెడ్ 0.11 cr
ఆంధ్ర(టోటల్) 0.51 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.24 cr (షేర్)
3 BHK‘ సినిమాకు రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.1.24 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.13 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.26 కోట్ల షేర్ ను రాబట్టాలి. పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా క్యాష్ చేసుకోలేకపోయింది. ప్రస్తుతానికి బ్రేక్ ఈవెన్ అయితే కష్టంగానే కనిపిస్తుంది.

Thammudu Collections: భారీ డిజాస్టర్ దిశగా ‘తమ్ముడు’

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus