3 BHK Collections: మంచి టాక్ వచ్చినా.. క్యాష్ చేసుకోలేకపోయిన ‘3 BHK’ ..!
- July 7, 2025 / 04:09 PM ISTByPhani Kumar
సిద్ధార్థ్ (Siddharth) హీరోగా శరత్ కుమార్ కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘3 BHK’ . జూలై 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మొదటి రోజు దీనికి డీసెంట్ టాక్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ కనెక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. ఎమోషనల్ గా కొంచెం డ్రాగ్ చేసినా.. కాన్సెప్ట్ వైజ్ అందరికీ కనెక్ట్ అయ్యేదే.
3 BHK Collections

అందుకే ‘3 BHK’ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. కానీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా ఈ సినిమా క్యాష్ చేసుకుంది లేదు.ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
మరిన్ని సినిమా వార్తలు.
| నైజాం | 0.44 cr |
| సీడెడ్ | 0.07 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.36 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.87 cr (షేర్) |
‘3 BHK‘ సినిమాకు రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.0.87 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.1.47 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.1.63 కోట్ల షేర్ ను రాబట్టాలి. పాజిటివ్ టాక్ వల్ల 2వ రోజు నుండి అడ్వాన్స్ బుకింగ్స్ పెరిగినా.. కలెక్షన్స్ లో భారీ మార్పు అయితే కనబడలేదు. తమిళంలో కూడా అంతే..! మరి వీక్ డేస్ లో కూడా ఇలా రాణిస్తుందేమో చూడాలి.
Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus















