సెప్టెంబర్ 25 చాలా మంచి రిలీజ్ డేట్. పాన్ ఇండియా సినిమాలకి అయితే ఇది బాగా కలిసొచ్చే రిలీజ్ డేట్ అనే చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ వీక్ కి గాంధీ జయంతి హాలిడే, దసరా హాలిడేస్ వంటివి ఉంటాయి. సంక్రాంతి సీజన్ తర్వాత ఈ సెప్టెంబర్ ఎండింగ్ అనేది బాక్సాఫీస్ కి కలిసొచ్చే సీజన్ గా చెప్పుకోవచ్చు. అందుకే ఈ సెప్టెంబర్ ఎండింగ్ కి పలు క్రేజీ సినిమాలు రిలీజ్ డేట్స్ లాక్ చేసుకోవడం జరిగింది. అందులో ముందుగా నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2′(అఖండ : తాండవం) (Akhanda2) ఉంది. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకుడు.
వీరి కాంబినేషన్లో ‘సింహా’ ‘లెజెండ్’ ‘అఖండ’ సినిమాలు వచ్చాయి. అన్నీ ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు ఘన విజయాలు సాధించాయి. ముఖ్యంగా ‘అఖండ’ సినిమా ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ రిలీజ్ అయ్యి కూడా భారీ వసూళ్లు సాధించింది. అందుకే ‘అఖండ 2’ (Akhanda2) పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సెప్టెంబర్ 25 నే పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమా కూడా వస్తుందని ప్రకటించారు మేకర్స్.
ఆల్రెడీ బిజినెస్ కూడా జరిగిపోతుంది. ‘ఓజి’ (OG Movie)పై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఏ పొలిటికల్ మీటింగ్ కి వెళ్లినా ఈ సినిమా గురించే ఆడియన్స్ ఆసక్తిగా అరవడం అందరూ గమనించే ఉంటారు. పవన్ కళ్యాణ్ కూడా ‘ఓజి’ చూద్దురుగాని బాగుంటుంది’ అని చెప్పడంతో అంచనాలు మరింత పెరిగాయి. అయితే ‘అఖండ 2’ ‘ఓజి’ పక్క పక్కనే వస్తే.. ఓపెనింగ్స్ పై ప్రభావం పడుతుంది.
వీటి రిలీజ్..ల విషయంలోనే క్లారిటీ లేదు అనుకుంటే.. మధ్యలో రామ్ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా సెప్టెంబర్ 25 కే వస్తుంది అంటూ ప్రచారం మొదలైంది. ఆ 2 పెద్ద సినిమాలకి పోటీగా రామ్ సినిమా వస్తుందా? ‘ఓజి’ అయితే వాయిదా పడే అవకాశం లేదు అని మేకర్స్ ట్వీట్ ద్వారా తెలిపారు. మరి ఆ డేట్ కి కచ్చితంగా ఏ సినిమా వస్తుందో చూడాలి.