Allu Arjun: అదిరిపోయే టైటిల్‌తో అక్కడ కూడా బన్నీ సినిమా స్పెషల్ షోలు..!

టాలీవుడ్ ‘స్టైలిష్ స్టార్’, ‘ఐకాన్ స్టార్’ నుండి ‘పాన్ ఇండియా’ స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్..2023 మార్చి 28తో నటుడిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.. తెలుగుతో పాటు మలయాళంలోనూ స్టార్ డమ్ సంపాదించుకుని అక్కడ ‘మల్లు’ అర్జున్‌గా అలరిస్తున్నాడు.. ‘పుష్ప : ది రైజ్’ తో నార్త్‌లోనూ సాలిడ్ క్రేజ్ తెచ్చకున్నాడు.. అక్కడ ‘పుష్ప’ రాజ్ గా సత్తా చాటి.. సీక్వెల్ ‘పుష్ప : ది రూల్’ కోసం ప్రేక్షకులంతా వెయిట్ చేసేలా చేశాడు..

ఇక ఇటీవల సందీప్ రెడ్డి వంగాతో బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ టీ సిరీస్ సంస్థలో సినిమా అనౌన్స్ చేశారు.. బన్నీ ఈ మూవీకి రెమ్యునరేషన్‌గా ఏకంగా రూ. 125 కోట్లు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.. ఇదిలా ఉంటే ఏప్రిల్ 8న ఐకాన్ స్టార్ బర్త్‌డే వస్తోంది.. ఈసారి సంబరాలు అదిరిపోయేలా ప్లాన్ చేస్తున్నారు.. మేకర్స్, ఫ్యాన్స్‌కి సాలిడ్ సర్‌ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నారు.. అల్లు అర్జున్ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన సాలిడ్ సూపర్ హిట్ ‘దేశముదురు’ ఏప్రిల్ 6న తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ కానుంది..

ఒకరోజు అటు ఇటుగా కర్ణాటకలోనూ విడుదల చేస్తున్నారు.. అలాగే మలయాళం అభిమానుల కోసం ఆ భాషలో డబ్ చేసి.. ‘హీరో – ది రియల్ హీరో’ పేరుతో వదులుతున్నారు.. 4K, DTS వంటి లేటెస్ట్ టెక్నాలజీతో లిమిటెడ్ స్క్రీన్లలో రీ రిలీజ్ చేయనున్నారు.. బన్నీ కమర్షియల్ హీరోగా నిలబడడంలో ‘దేశముదురు’ బాగా హెల్ప్ అయింది. బాల గోవింద్ క్యారెక్టర్‌లో బన్నీ మేనరిజమ్స్, డైలాగ్స్, సాంగ్స్, డ్యాన్స్ అన్నీ అదిరిపోతాయి..

ఇక ఏప్రిల్ 7వ తేదీ ‘పుష్ప : ది రూల్’ నుండి అదిరిపోయే ఫస్ట్ లుక్ పోస్టర్ రానుందని సమా చారం.. ఏప్రిల్ 8న పుట్టినరోజు నాడు మూడు నిమిషాల నిడివి గల గ్లింప్స్ రిలీజ్ కానుంది.. మొత్తానికి బన్నీ  బర్త్‌డే సెలబ్రేషన్స్ మూడు రోజుల పాటు గ్రాండ్‌గా జరుపుకోనున్నారు అల్లు అర్జున్  ఫ్యాన్స్..


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus