డ్రగ్స్ దందాలో ముగ్గురు టాలీవుడ్ హీరోయిన్లు
- July 13, 2017 / 01:54 PM ISTByFilmy Focus
టాలీవుడ్ ను కుదిపేస్తున్న డ్రగ్స్ దందాపై సిట్ చకచకా కదులుతున్న వేళ, నిన్న 10 మంది సినీ ప్రముఖులకు, నేడు ముగ్గురు హీరోయిన్లకు నోటీసులు అందాయి. ఇక విశ్వసనీయ పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు, బాల నటుడిగా కెరీర్ ను ప్రారంభించి హీరోగా విజయవంతమైన చిత్రాల్లో నటించి, ప్రస్తుతం చేతుల్లో సినిమాలేమీ లేకుండా ఖాళీగా ఉన్న ఓ యువనటుడికి డ్రగ్స్ దందాలో ప్రధాన పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. ఇతనితో పాటు ఓ వర్ధమాన గాయకురాలి భర్తకు, సినిమా ఫంక్షన్లు జరిగితే, హీరోలను ఆకాశానికి ఎత్తేలా పొగడ్తలు గుప్పిస్తుండే ఓ నిర్మాత (ఎన్నో సినిమాల్లో చిన్నా, పెద్ద పాత్రలు పోషించాడు), సినిమాల్లో తొలుత హీరోగా ప్రవేశించి, ఆపై సరైన బ్రేక్ లు రాక సెకండ్ హీరోగా స్థిరపడ్డ యువ నటుడు ఉన్నారు. అమెరికా నుంచి వచ్చి తొలుత హిట్ చిత్రాల్లో నటించి, ఆపై ప్రస్తుతం అడపాదడపా కనిపిస్తున్న నటుడికి, సినిమాలు వేగంగా తీస్తాడని పేరు తెచ్చుకున్న ఓ టాప్ డైరెక్టరు ఈ జాబితాలో ఉన్నారు.
నేడు నోటీసులు అందుకున్న హీరోయిన్లలో… అటు టీవీ తెరపై, ఇటు వెండి తెరపై రాణిస్తున్న ఓ నటి, అటు సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పుడు స్టేజ్ షోలు, న్యూ ఇయర్ పార్టీల్లో సందడి చేస్తుండే నటి, డైరెక్టర్లతో క్లోజ్ గా ఉంటూ ప్రొడక్షన్ బాధ్యతలను కూడా చూసే ఓ హీరోయిన్ ఉన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడిస్తున్నాయి. వీరి పేర్లను బయట పెట్టేందుకు తమకు అనుమతులు లేవని చెబుతూనే, వారి బయోడేటాలను పోలీసు వర్గాలు బహిర్గతం చేస్తున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














