Akkineni Family: నాగార్జున స్ట్రేంజ్ డెసిషన్ వెనుక ఉన్న కథ!

అక్కినేని ఫ్యామిలీకి (Akkineni Family) పెళ్లిళ్లు కలిసి రావడం లేదు అనే సెంటిమెంట్ ఉంది. నాగార్జున మొదటి పెళ్లి దగ్గుబాటి రామానాయుడు గారి అమ్మాయి లక్ష్మీతో జరిగింది. కానీ వీళ్ళ పెళ్లి సెట్ అవ్వలేదు. విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక నాగచైతన్య… సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వీళ్ళు కూడా నాలుగేళ్లకే విడిపోయారు. అలాగే అఖిల్ కి జరిగిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది. నాగార్జున మేనల్లుడు సుమంత్.. కీర్తి రెడ్డి లు కూడా విడాకులు తీసుకోవడం జరిగింది.

నాగార్జున మేనకోడలు సుప్రియ కూడా పెళ్లి తర్వాత విడాకులు తీసుకుంది. తర్వాత ఆమె మాజీ భర్త చనిపోయాడు. దీనిని బట్టి నాగార్జున నుండి ఫ్యామిలీకి ఏదో శాపం తగిలినట్టు అంతా గుడ్డిగా నమ్ముతున్నారు. అయితే అక్కినేని ఫ్యామిలీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగార్జున తన పిల్లలు నాగ చైతన్య, అఖిల్ లకు పెళ్లిళ్లు చేయాలని చూస్తున్నాడు.

అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ కే తన జీవితాన్ని అంకితం చేసిన సుప్రియ కి కూడా నాగ్ పెళ్లి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రియ విషయంలో నాగ్.. తన తండ్రి ఏఎన్నార్ కు ఇచ్చిన మాట అని తెలుస్తుంది. ఈ ముగ్గురి పెళ్లిళ్లు వీలైనంత త్వరగా జరిగే అవకాశాలు ఉన్నాయి.

ఈసారి సినీ ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీస్ తో సంబంధం వద్దని నాగార్జున అనుకుంటున్నాడట. అఖిల్ కి సంబంధం ఫిక్స్ అయినట్లు వినికిడి. అయితే అంతకంటే ముందు చైతన్యకి కూడా సంబంధం చూడాలి. ఇక సుప్రియ .. మావయ్య చెప్పినట్టు చేయడానికి రెడీగా ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ మూడు పెళ్లిళ్లు ఈ ఏడాదే జరిగే అవకాశం ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus