ప్రస్తుతం సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నప్పుడు ఎంతటి హంగామా నెలకొంటుందో.. ఓటీటీలో స్ట్రీమింగ్ అప్పుడు కూడా అంతే సందడి నెలకొంటుంది.. ఇంతకుముందు చూసిన వాళ్లు, చూడడం మిస్ అయిన వాళ్లు.. ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి కొత్త చిత్రాలను చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కూడా లేటెస్ట్ మూవీస్, వెబ్ సిరీస్‌లను ప్రేక్షకులకు అందుబాటులోకి తెచ్చేందుకు పోటీ పడుతున్నాయి.. ఫిబ్రవరి, మార్చి పరీక్షల సీజన్ కావడంతో పెద్ద సినిమాలు ఏప్రిల్ రెండో వారం నుండి షెడ్యూల్ చేసుకున్నాయి.. లాస్ట్ వీక్ వచ్చిన ‘కబ్జ’, ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నాయి.. ఓటీటీ మరియు థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు, సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం..
దాస్ కా ధమ్కీ..
యంగ్ హీరో విశ్వక్ సేన్ ద్విపాత్రాభినయం చేస్తూ, దర్శకత్వం వహించగా.. విశ్వక్ తండ్రి కరాటే రాజు నిర్మించిన యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్.. ‘దాస్ కా ధమ్కీ’.. నివేదా పేతురాజ్ కథానాయిక.. ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రంగమార్తాండ..
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ‘రంగమార్తాం’ చిత్రంతో కమ్ బ్యాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.. రంగస్థల కళాకారుల జీవిత నేపథ్యంలో.. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ తదితరలు నటించిన ఫ్యామిలీ, ఎమోషనల్ ఫిలిం ‘రంగమార్తాండ’ మార్చి 22న విడుదలవుతోంది..
ఘోస్టి..
కాజల్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ్ చిత్రం ‘ఘోస్టి’.. ఊర్వశి, యోగిబాబు తదితరులు నటించగా కళ్యాణ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగులో ‘కోస్టి’ పేరుతో రిలీజ్ కానుంది..
గీతసాక్షిగా..
సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘గీతసాక్షిగా’.. ఆదర్శ్, చిత్రా శుక్లా, భరణి, రాజా రవీంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్ నటించిన ఈ సినిమాకి ఆంటోనీ మట్టిపల్లి దర్శకుడు.. మార్చి 22న రిలీజ్ చేస్తున్నారు..
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు/వెబ్ సిరీస్‌లు..
అమెజాన్ ప్రైమ్..
హంటర్ – (హిందీ సిరీస్) – మార్చి 22
పఠాన్ – (తెలుగు డబ్బింగ్ మూవీ) – మార్చి 22
నెట్‌ఫ్లిక్స్..
వుయ్ లాస్ట్ అవర్ హ్యుమన్ – (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 21
వాకో: అమెరికన్ అపొకలిప్స్ – (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 22
ద నైట్ ఏజెంట్ – (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 23
చోర్ నికల్ కే భాగా – (హిందీ సినిమా) – మార్చి 24
హూ వర్ వుయ్ రన్నింగ్ ఫ్రమ్ – (టర్కీస్ సిరీస్) – మార్చి 24
హై & లో ద వరస్ట్ ఎక్స్ – (కొరియన్ మూవీ) – మార్చి 25
క్రైసిస్ – (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 26
ఆహా..
వినరో భాగ్యము విష్ణుకథ – మార్చి 22
డిసెండెంట్స్ ఆఫ్ ది సన్ – (తెలుగు డబ్బింగ్ సిరీస్) – మార్చి 24
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..
సక్సెసెన్ సీజన్ 4 – (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 26
ఈటీవీ విన్..
పంచతంత్రం – (తెలుగు మూవీ) – మార్చి 22
రైటో లెఫ్టో – (సిట్ కామెడీ సిరీస్) – మార్చి 22
జీ5..
దే దక్కా 2 – (మరాఠీ మూవీ) – మార్చి 24
కంజూస్ మకీచోస్ – (హిందీ మూవీ) – మార్చి 24
పూవన్ – (మలయాళ సినిమా) – మార్చి 24
సెంగలమ్ – (తమిళ సిరీస్) – మార్చి 24
బుక్ మై షో..
లెగసీ పీక్ – (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 23
మూన్ రైజ్ – (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 23
ఇన్ సైట్ – (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 24
సోనీ లివ్..
లక్కీ హ్యాంక్ – (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి 20
పురుష ప్రేతమ్ – (మలయాళ మూవీ) – మార్చి 24
షీమారో మీ..
కర్మ – (గుజరాతీ మూవీ) – మార్చి 23
సైనా ప్లే..
ఓ మేరీ లైలా – (మలయాళ సినిమా) – మార్చి 23
హోయ్ చోయ్..
ఇందుబాల బాతేర్ హోటల్ సీజన్ 2 – (బెంగాలీ సిరీస్) – మార్చి 24
లయన్స్ గేట్ ప్లే.
మ్యాక్స్ స్టీల్ – (ఇంగ్లీష్ మూవీ) – మార్చి 24
ఆన్ ద లైన్ – (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 24
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?