Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » సాగర సంగమం కు 38 సంవత్సరాలు !

సాగర సంగమం కు 38 సంవత్సరాలు !

  • June 2, 2021 / 05:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సాగర సంగమం కు 38 సంవత్సరాలు !

కే.విశ్వనాధ్ , ఏడిద నాగేశ్వరరావు , కమలహాసన్ ల కలయిక లో పూర్ణోదయా పతాకం పై నిర్మిచించిన ప్రతిష్టాత్మక , కళాత్మక చిత్రం ‘“ సాగర సంగమం ‘ . ఈ చిత్రం జూన్ 3 , 1983 న తెలుగులో “సాగర సంగమం” , తమిళంలో “ సలంగై ఓలి “ , “ మలయాళంలో “ సాగర సంగమం “ గా ఒకే రోజు విడుదల అయ్యాయి . అన్ని భాషల్లో ఆఖండ విజయం సాధించింది . నేటి మేటి దర్శకులెందరికో స్ఫూర్తి ఈ చిత్రం. ఈ విషయం వాళ్ళు స్యయంగా ఎన్నో సార్లు వ్యక్తపరిచారు . శంకరాభరణం అంతటి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన చిత్రం తరువాత అదే కాంబినేషన్ అయిన కే.విశ్వనాథ్ – ఏడిద నాగేశ్వరరావు కలయికలో వచ్చిన మరో సంచలన కళా ఖండం ,” సాగర సంగమం “. భారత చలనచిత్ర 100 సంవత్సరాలు సందర్భంగా CNN-IBNs List of the 100 Greatest Indian Films of All Time లో ఈ చిత్రం 13 వ స్థానం దక్కించుకుంది .

అలాగే రష్యన్ భాషలోకి అనువదించి అక్కడి 400 థియేటర్లలో ఒకే సారి విడుదలయ్యి వారి అభిమానాన్ని కూడా పొందిన మొట్ట మొదటి తెలుగు చిత్రం . ఈ చిత్రం శతదినోత్సవం తో పాటు ఎన్నో కేంద్రాలలో సిల్వర్ జూబిలీ , గోల్డెన్ జూబిలీ కూడా జరుపుకుంది. బెంగుళూరు లో 511 రోజులు ఒకే థియేటర్ లో ప్రదర్శింపబడ్డ చిత్రం సాగర సంగమం . ఈ చిత్రం విడుదలయ్యాక చాలా మంది శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి డాన్స్ క్లాసులకి వెళ్లేవారు . ఇప్పటికీ లోక నాయకుడు కమలహాసన్ తనకు బాగా నచ్చిన చిత్రాల్లో సాగర సంగమం పేరే ముందుంటది. అలాగే కళా తపస్వి శ్రీ కే.విశ్వనాధ్ దర్శక ప్రతిభ ప్రతీ సన్నివేశంలో మనకు కనబడుతుంది . ఇక ఇళయరాజా సంగీతం … ఈ చిత్రానికి ఓ హై లైట్ . ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి . అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వైవిధ్యంగా కుదిరింది .

అప్పటికే ఎన్నో తమిళ సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించి ఓ ట్రెండ్ సెట్ చేసిన ఇళయరాజాకు మొట్ట మొదటి సారి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ బహుమతి ఇచ్చిన చిత్రం సాగర సంగమం. అలాగే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కీ ఉత్తమ గాయకునిగా జాతీయ అవార్డు . జంధ్యాల మాటలు, వేటూరి పాటలు , నివాస్ ఫోటోగ్రఫీ , తోట తరణి కళా దర్శకత్వం ఇంకా ఎందరో ప్రతిభావంతుల కలయికే ఈ చిత్రాన్ని all time classic గా రూపుదిద్దింది. ఈ చిత్ర శతదినోత్సవానికి హిందీ అగ్ర నటులు రాజకపూర్ , సునీల్ దత్ & రాజేంద్ర కుమార్ గార్లు ముఖ్య అతిధులుగా విచ్చేసి సాగర సంగమం గురించి ఎంతో గొప్పగా విశ్లేషించారు . కమలహాసన్ నూతి మీద డాన్స్ చేసే “తకిట -తధిమి” పాట , జయప్రద తో కలిసి చేసే “ నాద వినోదము “ క్లైమాక్స్ లో వచ్చే “వేదం అణువణువున” పాటల్లో కమలహాసన్ చేసిన క్లాసికల్ డాన్సులు ఇప్పటికీ మనకి ఓ కొత్త అనుభూతినిస్తాయి . అలాగే మౌనమేలనోయి పాటలో జయప్రద చూపిన హావభావాలు , ఎస్.పి. శైలజ నటన ఈ చిత్రానికి మరో ప్రత్యేకత . సిరి సిరి మువ్వ, శంకరాభరణం తరువాత ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన మరో కళాత్మక దృశ్య కావ్యం సాగరసంగమం. కళకు అంతం లేదు అనే భావన కలిగేందుకే ఈ చిత్రం చివర్లో “ NO END FOR ANY ART “ అని వస్తుంది .

1

2

3

4

5

6

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Edida nageswararao
  • #Jaya Prada
  • #K Vishwanatham
  • #Kamal Haasan
  • #Saagara Sangamam

Also Read

Mithra Mandali Collections: దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

Mithra Mandali Collections: దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

related news

రజనీ – కమల్‌ని నేను డైరెక్ట్‌ చేయడం లేదు: యువ దర్శకుడు క్లారిటీ!

రజనీ – కమల్‌ని నేను డైరెక్ట్‌ చేయడం లేదు: యువ దర్శకుడు క్లారిటీ!

trending news

Mithra Mandali Collections: దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

Mithra Mandali Collections: దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

6 hours ago
Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

7 hours ago
Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

7 hours ago
K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

7 hours ago
Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

8 hours ago

latest news

Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

1 day ago
K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

1 day ago
Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

1 day ago
K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

Telusu Kada Collections: ‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version