Venkatesh: ‘సంక్రాంతి’ తర్వాత నెక్స్ట్‌ ఏంటి? వెంకటేశ్‌ ఏం చేస్తారు?

గతేడాది సంక్రాంతికి ‘సైంధవ్‌’ అంటూ వచ్చి బాక్సాఫీసు దగ్గర దెబ్బడిపోయారు వెంకటేశ్‌. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ సంక్రాంతి రోజే వస్తున్నారు. ఏంటో కానీ ఈ సినిమాకు అప్పుడే హిట్‌ వైబ్స్‌ కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి కూడా. దీంతో వెంకటేశ్‌ నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌ ఏంటో అనే చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే వెంకీ గతేడాది ఒక్క సినిమానే చేశారు. ఆ గ్యాప్‌ ఈ ఏడాది పూర్తి చేయాలి అనేది ఫ్యాన్స్‌ కోరిక.

Venkatesh

ఇదే విషయాన్ని వెంకీ దగ్గర ప్రస్తావిస్తే.. ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తనతో సినిమా చేయడానికి నలుగురు నిర్మాతలు రెడీగా ఉన్నారు అని చెప్పారు. అందులో సురేశ్‌బాబు కూడా ఉన్నారు అనుకోండి. వెంకటేశ్‌ లైనప్‌ చూస్తే.. సురేష్ ప్రొడక్షన్స్, మైత్రీ మూవీ మేకర్స్, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌, వైజయంతి మూవీస్ కనిపిస్తున్నాయి. సురేశ్‌బాబు, నవీన్‌ – రవిశంకర్‌, నాగవంశీ, స్వప్న – ప్రియాంక ప్రస్తుతం కథల పనిలో ఉన్నారట.

వీరిలో ఎవరితో నెక్స్ట్‌ సినిమా చేయాలి అనే విషయంలో వెంకీ ఇంకా ఓ నిర్ణయానికి రాలేదట. ఇంకా ఏ కథకూ ఓకే చెప్పిని వెంకీ.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజ్‌ అయ్యాక గుడ్‌ న్యూస్‌ చెప్పాలని అని అనుకుంటున్నారట. ఇప్పటికే వెంకటేశ్‌ సినిమా అంటూ చాలామంది దర్శకుల పేర్లు వినిపిస్తూ వచ్చాయి. అందులో తరుణ్‌ భాస్కర్‌, విమల్‌ కృష్ణ, అనుదీప్‌ లాంటి వాళ్ల పేర్లు ఉన్నాయి. మరిప్పుడు ఎవరితో సినిమా చేస్తారో చూడాలి.

ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంగతి చూస్తే.. ఎక్స్‌ పోలీసు, ఎక్స్‌లెంట్‌ వైఫ్‌, ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌ మధ్య సాగే త్రికోణం కామెడీ కథ. సంక్రాంతికి నాలుగు రోజులు ముందు మొదలయ్యే ఈ కథ ఆ రోజుతో ముగుస్తుంది. ముగ్గురూ కలసి ఏం చేశారు? ఎవరి కోసం చేశారు? అనుకున్న పని అయ్యాక ఏం జరిగింది అనేది సినిమా కథ అని చెబుతున్నారు. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో.. అందులోనూ ఇద్దరు హీరోయిన్లతో వెంకీ వస్తే విజయం పక్కా అని అంటుంటారు. ఈసారి అదే అవుతుందా?

అనారోగ్యం నుండి కోలుకున్న విశాల్‌ క్లారిటీ.. ఇక ఆ చర్చకు ఫుల్‌స్టాప్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus