Vishal: అనారోగ్యం నుండి కోలుకున్న విశాల్‌ క్లారిటీ.. ఇక ఆ చర్చకు ఫుల్‌స్టాప్‌!

ప్రముఖ తమిళ కథానాయకుడు విశాల్‌కి ఏమైంది? గత కొన్ని రోజులుగా తమిళ, తెలుగు సోషల్‌ మీడియాలో ఈ టాపిక్‌ గురించే చర్చ జరిగింది. ‘మద గజ రాజా’ సినిమా ప్రెస్‌ మీట్‌కి వచ్చిన ఆయన వీక్‌గా, వణుకుతూ ఉండటం చూసిననప్పటి నుండి ఈ మాటలు మొదలయ్యాయి. ఆయనకేదో అయిపోయింది అంటూ తెగ వార్తలు వచ్చాయి. అయితే అది కేవలం వైరల్‌ ఫీవర్‌ మాత్రమే అంటూ టీమ్‌, వైద్యులు క్లారిటీ ఇచ్చారు. నటి ఖుష్బూ కూడా అది ఫీవరే అని చెప్పారు. చెప్పినట్లుగానే విశాల్‌ తిరిగొచ్చాడు.. అది కూడా పాత లుక్‌లో ఫుల్‌ జోష్‌తో.

Vishal

విశాల్‌ రో ఆరోగ్యపరిస్థితిపై గత కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులు తాజాగా అతనిని చూసి ఊపిరి పీల్చుకున్నారు. ‘మద గజ రాజా’ సినిమా ప్రీమియర్ షోకు విశాల్‌ హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో విశాల్ పూర్తిగా కోలుకున్నట్టు కనిపిస్తోంది. దీంతో హమ్మయ్య అని ఫ్యాన్స్‌ ఊపిరి పీల్చుకున్నారు.

ఇక తన ఆరోగ్యం గురించి విశాల్‌ కూడా స్పందించాడు. మా నాన్న అంటే నాకెంతో ఇష్టం. ఆయన వల్లే ధైర్యంగా ఉన్నా. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నా. ఆరు నెలలకొకసారి నేను సినిమాల నుండి విశ్రాంతి తీసుకుని వెళ్లిపోతున్నానని కొంతమంది అంటున్నారు. నాకు ఎలాంటి సమస్యలూ లేవు. ఇప్పుడు నా చేతులు వణకడం లేదు. మైక్‌ కరెక్ట్‌గా పట్టుకున్నా అని తన మీద వచ్చిన కామెంట్లకు సమాధానం ఇచ్చాడు.

విశాల్‌ హీరోగా సుందర్‌.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మదగజరాజ’. 12 ఏళ్ల క్రితమే ఈ సినిమా పూర్తయిననప్పటికీ వివిధ కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్‌గా ఇప్పుడు అంటే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్‌ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకు బాక్సాఫీసు దగ్గర మంచి టాకే వచ్చింది.

ల్‌ రాజు సారీ చెప్పి విషయం పక్కన పెట్టారు కానీ.. ఈ మాటలు ఇంకెవరూ అనలేదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus