ఓ భాషలో హిట్ అయిన సినిమాని మిగిలిన భాషల్లోకి రీమేక్ చేయడం సహజం. అలా రీమేక్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే ఒకే భాషలో కూడా ఒకే కథతో తెరకెక్కిన సినిమాలు ఉన్నాయి. అప్పట్లో వచ్చిన ‘దేవదాసు’ కథ ‘అర్జున్ రెడ్డి’ కథ ఒక్కటే, అలాగే ‘స్టేట్ రౌడీ’ కథ ‘పోకిరి’ కథలు కూడా ఒకటే, ‘మీనా’- ‘అఆ’ గాను, ‘ఒంటరి పోరాటం’ – ‘అజ్ఞాతవాసి’.. వీటి కథలు ఒకటే కానీ కథనాలు వేరు. అయితే ఒక్క కథని మాత్రం ఏకంగా 7 సార్లు తీశారు.
అది ఏ కథ? అందులో ఎన్ని హిట్ అయ్యాయి? ఎన్ని ప్లాప్ అయ్యాయి? అనే విషయాలని ఓ లుక్కేద్దాం రండి. 1988 వ సంవత్సరంలో కృష్ణంరాజు- శరత్ బాబు లు ప్రధాన పాత్రల్లో ‘ప్రాణ స్నేహితులు’ అనే సినిమా వచ్చింది. అప్పట్లో ఈ చిత్రం మంచి విజయాన్నే సొంతం చేసుకుంది. ‘స్నేహానికన్న మిన్న’ అనే పాట అప్పట్లో చార్ట్ బస్టర్ అయ్యింది. అయితే 1979 వ సంవత్సరంలో హిందీలో వచ్చిన ‘కుడి గర్జ్’ కు ఇది రీమేక్.
అటు తర్వాత 1992 వ సంవత్సరంలో అదే కథని ‘అన్న మలై’ గా తమిళంలో తీశారు. అక్కడ కూడా ఈ చిత్రం హిట్ అయ్యింది. ఆ వెంటనే తెలుగులోకి కూడా డబ్ చేయడం జరిగింది. అయినప్పటికీ మరో రెండేళ్ళకి వెంకటేష్- సుమన్ లను హీరోలుగా పెట్టి మళ్ళీ తెలుగులో రీమేక్ చేసాడు దర్శకుడు రవిరాజా పినిశెట్టి. ఆ చిత్రం కూడా మంచి విజయాన్నే సొంతం చేసుకుంది కానీ.. అలా ఆ కథ 5 సార్లు తెరకెక్కడం విశేషంగా చెప్పుకోవాలి.