Prabhas, Chiranjeevi: కొత్త సంవత్సరం కొత్త ముచ్చట్లు కొత్త కొత్తగా!

కొత్త సంవత్సరం రాబోతోంది… ఇంకేముంది సినిమా అభిమానులకు పోస్టర్లు, టీజర్లు, మోషన్‌ పోస్టర్లు, లుక్‌లతో కిక్కే కిక్కు. రాబోయే సినిమాలకు సంబంధించి వివరాలతో ఆయా చిత్రబృందాలు సోషల్‌ మీడియాను నింపేస్తాయి. మిగిలిన హీరోల సంగతేమో కానీ… ఓ ముగ్గురి నుండి మాత్రం మామూలు సర్‌ప్రైజ్‌లు ఉండవు అని తెలుస్తోంది. వాళ్లే చిరంజీవి, ప్రభాస్‌, పవన్‌ కల్యాణ్‌. ఎందుకంటే వారి లైనప్‌లో అన్ని సినిమాలు ఉన్నాయి మరి. డౌటా… అయితే ఓసారి లిస్ట్‌ సిద్ధం చేస్తున్నాం చూడండి.

ముందుగా చిరంజీవి సంగతి చూద్దాం. మొన్నీ మధ్య చిరంజీవి రికార్డు సినిమాలు అని వార్త కూడా చదివే ఉంటారు. అదేంటంటే… ప్రస్తుతం సెట్స్‌ మీద చిరంజీవి సినిమాలు నాలుగు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఓ హీరో నుండి ఇలాంటి ఫీట్‌ మనం చూడలేదు. ‘ఆచార్య’ సినిమాకు తుది మెరుగులు దిద్దుతుండగా, ‘గాడ్‌ ఫాదర్‌’, ‘భోళా శంకర్‌’, బాబీ సినిమా సెట్స్‌ మీద ఉన్నాయి. సీనియర్‌ స్టార్‌ హీరో నుండి ఇది వావ్‌ అనిపించుకునే ఫీటే. ఇవి కాకుండా వెంకీ కుడుముల సినిమా అనౌన్స్‌మెంట్‌ కూడా జరిగింది. సో చిరంజీవి ఫ్యాన్స్‌కు ఐదు సినిమాల అప్‌డేట్‌లు వస్తాయి.

ఆ తర్వాత డార్లింగ్‌ ప్రభాస్‌ విషయానికొస్తే… దాదాపుగా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ‘రాధే శ్యామ్‌’ సంక్రాంతికి రిలీజ్ అవుతోంది. ఇది కాకుండా ‘సలార్‌’, ‘ప్రాజెక్ట్‌ కె’, ‘ఆది పురుష్‌’, ‘స్పిరిట్‌’ లైనప్‌లోఉన్నాయి. ఇందులో ‘ఆదిపురుష్‌’ షూటింగ్‌ అయిపోగా, ‘‘స్పిరిట్‌’ మొదలవ్వాల్సి ఉంది. వీటికి సంబంధించిన అప్‌డేట్లు ఎలాగూ ఉంటాయి. ఇవి కాకుండా సిద్ధార్థ్‌ ఆనంద్‌ – మైత్రీ మూవీ మేకర్స్‌ కాంబోలో ప్రభాస్‌ సినిమా అని వార్తలొచ్చాయి. ఆ సినిమా వివరాలు కూడా రావొచ్చని టాక్‌.

మూడో హీరో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. ఆయన చేతిలోనూ వరుస సినిమాలే ఉన్నాయి. ఇప్పుడు ‘భీమ్లా నాయక్‌’ షూటింగ్‌ నడుస్తోంది. ఇది కాకుండా ‘హరి హర వీరమల్లు’ సినిమా ఒకటి ఉంది. ఈ సినిమా షూటింగ్‌ని జనవరిలో స్టార్ట్‌ చేస్తామని ఇటీవల క్రిష్‌ తెలిపారు. ఇవి కాకుండా ‘భవదీయుుడు భగత్‌ సింగ్‌’ కూడా ఉంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ కూడా మొదలవుతుంది.

సురేందర్‌ రెడ్డి – రామ్‌ తాళ్లూరి సినిమా కూడా లైనప్‌లో ఉంది. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వినోదాయ సీతాం’ సినిమాను రీమేక్‌ చేస్తారని టాక్‌. ఈ సినిమాల గురించి అప్‌డేట్స్‌ రావొచ్చు.

 

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus