Salaar: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సలార్!

  • December 26, 2023 / 11:54 AM IST

పాన్ ఇండియా స్టార్ హీరో సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదలైన ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో ఈ సినిమా దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదల అయ్యి మూడు రోజులను పూర్తిచేసుకుని నాలుగవ రోజు కొనసాగుతుంది. అయితే మూడు రోజులకు గాను ఈ సినిమా ఏకంగా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టిస్తుంది. ఈ సినిమా మూడు రోజులకు ఏకంగా 402 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్టు హోం బలే ఫిలిం మేకర్స్ వారు అధికారక పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇలా మూడు రోజులకే 400 కోట్ల కలెక్షన్ అంటే ప్రభాస్ మేనియా మామూలుగా లేదని తెలుస్తోంది. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా అనుకున్న దానికంటే భారీ స్థాయిలోనే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది. ఇలా మూడు రోజులకే ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టడంతో ముందు ముందు ఈ సినిమా మరిన్ని కలెక్షన్లను రాబడుతుందోనని సినీ సెలబ్రిటీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం షారుఖ్ ఖాన్ సినిమాని వెనక్కి నెట్టి సలార్ దూసుకుపోతుంది..

సలార్ (Salaar) దూకుడు చూస్తుంటే వారం తిరిగేలోగా 1000 కోట్ల కలెక్షన్లను రాబడుతుందని ట్రేడ్ నిపుణులు అంచనాలు వేస్తున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ మూడు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏ సినిమా కూడా ఈ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus