Kiran Rathod Eliminated: కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ వెనక ఏం జరిగింది ? అసలైనా కారణాలేంటి ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఫస్ట్ వీక్ హీరోయిన్ కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయిపోయింది. అసలు కిరణ్ రాధోడ్ ఎందుకు ఎలిమినేట్ అయ్యింది ? తెలుగు రాకపోవడమే ఆమె ప్రాబ్లమా ? అసలైనా కారణాల్లోకి వెళ్లినట్లయితే, కిరణ్ రాధోడ్ ని ఈ ఫస్ట్ వీక్ లో ముగ్గురు నామినేట్ చేశారు. టేస్టీ తేజ, శోభాశెట్టి ఇద్దరు తెలుగు రాదనే రీజన్ చెప్పారు. అలాగే, వీక్ కంటెస్టెంట్ అని, బాధపడుతోందని పల్లవి ప్రశాంత్ కిరణ్ రాథోడ్ ని నామినేట్ చేశాడు. దీంతో మూడు ఓట్లతో నామినేషన్స్ లోకి వచ్చింది.

ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఒక్కసారి మనం కారణాలు చూసినట్లయితే.,

నెంబర్ – 1

తెలుగు రాకపోవడం అనేది తెలుగు షోలో పెద్ద సమస్యేం కాదు. కానీ, తనకి పూర్తిగా బిగ్ బాస్ కమాండ్స్ సైతం అర్దం కాలేదు. అంతేకాదు, బిగ్ బాస్ ని ఇంప్రెస్ చేయమంటే ఎలాంటి యాక్టివిటీ చేయాలో కూడా తనకి అర్ధం కాలేదు.

నెంబర్ 2

షకీల, శివాజీ , తేజ వీళ్లతో తప్ప మిగతా కంటెస్టెంట్స్ తో మింగిల్ అవ్వలేకపోయింది. యంగ్ స్టార్స్ అయిన అమ్మాయిలతో పోటీ పడలేకపోయింది. అనుకున్నంత స్క్రీన్ స్పేస్ కూడా కిరణ్ కి రాలేదు.

నెంబర్ 3

కిచెన్ లోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం, తను చేసిన స్కిట్ కూడా టెలికాస్ట్ కాకపోవడం, తను చేసిన ఎంటర్ టైన్మెంట్ కూడా కన్సిడర్ అవ్వకపోవడం అనేది తనకి మైనస్ అయ్యాయి.

నెంబర్ 4

సోషల్ మీడియాలో పెద్దగా ఫాలోయింగ్ లేకపోవడంతో తన ఓటింగ్ పై ఎక్కువ ప్రబావాన్ని చూపించింది. అంతేకాదు, బిగ్ బాస్ కి వచ్చే ముందు కూడా తను ఎలాంటి యాక్టివిటీస్ చేయలేకపోయింది.

నెంబర్ 5

తెలుగువారికి చాలాకాలం దూరంగా ఉండటం వల్ల కిరణ్ ని అందరూ మర్చిపోయారు. తను ఏ సినిమాలు చేసిందో కూడా గుర్తులేదు. అందుకే కనెక్ట్ కాలేకపోయారు. తను చేసిన సినిమాల్లో కూడా గుర్తుండి పోయే పాత్రలు కూడా పెద్దగా లేకపోవడం అనేది కిరణ్ రాథోడ్ కి మైనస్. ఈ కారణాల వల్ల తను బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో ముందుకు వెళ్లలేకపోయింది. బహుశా ఇంకొన్ని వారాలు ఉంటే తన గేమ్ తో ఏమైనా ఇంప్రెస్ చేసి ఉండేదేమో. ఫస్ట్ వీక్ నామినేషన్స్ లోకి రావడం అనేది తన బ్యాడ్ లక్ అనే చెప్పాలి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus