Pushpa2: ‘పుష్ప 2’ క్రేజ్ చూస్తే.. మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన రా అండ్ రస్టిక్ మూవీ ‘పుష్ప'(ది రైజ్). కోవిడ్ తర్వాత జనాలు థియేటర్ కి అప్పుడప్పుడే రావడం స్టార్ట్ చేసిన టైంలో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఓ మాదిరి సక్సెస్ అందుకున్న ఈ మూవీ హిందీలో మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అక్కడి బయ్యర్స్ కి ఏకంగా పది రెట్లు లాభాలను అందించింది.

అలాగే తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా బ్రేక్ ఈవెన్ సాధించి అల్లు అర్జున్ ను ట్రూ పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టింది. నేషనల్ అవార్డు కూడా కట్టబెట్టింది. ఇక ఇప్పుడు ‘పుష్ప 2 ‘ వంతు వచ్చింది. పార్ట్ 1 హిట్ అవ్వడంతో, పార్ట్ 2 పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అన్ని భాషల్లోనూ బయ్యర్స్ పుష్ప 2 గురించి జపం చేయడం మొదలుపెట్టారు. 2024 ఆగస్టు 15 న ఈ సినిమా రిలీజ్ కానుంది.

అయినప్పటికీ ఇప్పటి నుండే థియేట్రికల్ హక్కుల కోసం పెద్ద ఎత్తున అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేసుకుంటున్నారు కొంతమంది బయ్యర్స్. థియేట్రికల్, నాన్ థియేట్రికల్.. రైట్స్ ప్రకారం ‘పుష్ప 2 ‘ కి రూ.500 కోట్ల వరకు బిజినెస్ జరగబోతుందని ఇన్సైడ్ టాక్. మొదటి భాగానికి రూ.180 కోట్ల బడ్జెట్ పెట్టిన చిత్ర బృందం.. (Pushpa2) రెండో భాగానికి రూ.260 కోట్ల వరకు బడ్జెట్ పెడుతున్నట్టు ఇన్సైడ్ టాక్

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus