Bigg Boss Telugu 6: ఈవారం డిఫరెంట్ నామినేషన్స్..! ఎవరెవరు జంటలుగా ఉన్నారంటే..?

బిగ్ బాస్ హౌస్ లో 5వ వారం నామినేషన్స్ అనేవి ఆసక్తికరంగా మలిచారు. ఇద్దరు హౌస్ మేట్స్ చేతులకి కఫ్స్ వేసుకుంటారు. ఆర్గ్యూమెంట్ చేసుకుని ఒకరు రిలీజ్ చేసుకుని నామినేట్ అవ్వాల్సి ఉంటుంది. ఒకరు సేఫ్ అవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఈసారి మాస్టర్ ప్లాన్ వేశాడు బిగ్ బాస్. ఏ ఇద్దరికీ అయితే సరిగ్గా పడట్లేదో వాళ్లని నామినేషన్స్ జంటలుగా విభజించాడు. ఇందులో మొదటగా శ్రీహాన్ – ఇనయసుల్తానా, సుదీప-వాసంతీ, ఆదిరెడ్డి – రేవంత్, చంటి – గీతు, ఫైమా – రాజ్, మెరీనా – రోహిత్, అర్జున్ కళ్యాణ్ – శ్రీసత్య వీళ్లని జంటలుగా విడగొట్టారు.

ఇందులో నుంచీ ఒక్కొక్కరు నామినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రీసంట్ గా వచ్చిన ప్రోమోని బట్టీ చూస్తే ఇప్పటికే మెరీనా, వాసంతీ, ఇంకా ఇనయసుల్తానాలు నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రోమోలో శ్రీహాన్ కి ఇంకా ఇనయకి గట్టి ఫైట్ అయ్యింది. ఇనయ చాలా స్ట్రాంగ్ గా శ్రీహాన్ ని ఎదిరించింది. నేను నామినేషన్స్ లోకి వెళ్తాను, సేవ్ అయి వస్తాను, టైటిల్ విన్ అవుతాను అంటూ రెచ్చిపోయింది. నామినేషన్స్ లోకి నేను రాను అంటూ శ్రీహాన్ ఫైటింగ్ స్టార్ట్ చేశాడు. దీనికి గట్టి కౌంటర్ ఇస్తూనే ఇనయ ఫ్రస్టేట్ అయ్యింది.

ఫ్రెండ్స్ ని జంటలుగా ఉంచాలి కానీ, ఇలా చేయడం ఏంటని అడిగింది. దీనికి శ్రీహాన్ ఫ్రెండ్షిప్ అనేసరికి మొన్న సీజన్ మొత్తం కెప్టెన్సీ రద్దు అంటూ ఓటు వేశావ్, ఇప్పుడు ఫ్రెండ్ అని ఎలా అంటున్నావ్ అంటు నిలదీసింది. దీంతో శ్రీహాన్ కి ఆన్సర్ లేకుండా పోయింది. బిగ్ బాస్ పై గట్టిగా అరుస్తూ సంకెళ్లు తెంపేసుకుని నామినేట్ అయ్యింది ఇనయ. ఇక మరోవైపు గీతు ఇంకా చంటి ఇద్దరి మద్యలో మరోసారి సాలిడ్ అర్గ్యూమెంట్ అయినట్లుగానే తెలుస్తోంది.

ఇందులో చంటి నామినేట్ అయినట్లుగా సమాచారం. తర్వాత ఆదిరెడ్డి ఇంకా రేవంత్ మద్యలో కూడా మాటల యుద్ధమే జరిగింది. వీరిద్దరూ గట్టిగానే ఫైట్ చేసినట్లుగా తెలుస్తోంది. చివరకి ఆదిరెడ్డి ఈవారం నామినేట్ అయ్యాడు. ఇక ఫైమా రాజ్ ఇద్దరి మద్యలో ఫైమా నామినేట్ అయినట్లుగా తెలుస్తోంది. శ్రీసత్య కోసం అర్జున్ మరోసారి నామినేట్ అయి తనపై ఉన్న ప్రేమని చాటుకున్నాడు. ఇలా ఎనిమిది మంది నామినేషన్స్ లోకి వచ్చినట్లుగా సమాచారం. ఎవరెవరు ఉన్నారంటే.,

నామినేషన్స్ లో అర్జున్ కళ్యాణ్, చంటి, ఆదిరెడ్డి, ఫైమా, వాసంతీ కృష్ణన్, బాలాదిత్య, మెరీనా, ఇంకా ఇనయ సుల్తానాలు ఉన్నారు. అయితే, ఇక్కడ మెరీనా రోహిత్ ఇద్దరినీ ఈవారం నుంచీ బిగ్ బాస్ విడగొట్టేశాడు. ఇద్దరూ వేరు వేరుగా ఉండచ్చని, ఎవరి గేమ్ వాళ్లు ఆడచ్చని ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో మెరీనా నామినేట్ అయి, రోహిత్ ని సేవ్ చేసింది. ఇక వీళ్లిద్దరూ ఇండివెడ్యువల్ గేమ్ ఎలా ఆడతారు అనేది చూడాలి. అలాగే ఆర్గ్యూమెంట్స్ తో ఈవారం నామినేషన్స్ అనేవి ఆసక్తికరంగా మారాయి.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus