ప్లాపుల్లో ఉన్న హీరోలు ఎప్పుడెప్పుడు హిట్టు కొడతామా అని ఎదురుచూస్తుంటారు. ఒక్కోసారి ఎన్ని ప్రయోగాలు చేసినా.. ఎంత కష్టపడినా హిట్టు వస్తుందని గ్యారంటీ ఉండదు. అందుకు టైం కూడా రావాలి. అలా హిట్టు కోసం ఎదురుచూస్తున్న హీరోలకి ఈ సంవత్సరం బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. మొత్తానికి ఈ ఏడాది ప్లాప్ హీరోలు బయటపడ్డారు. ‘బాక్సాఫీస్’ వద్ద వారి చిత్రాలు మంచి కలెక్షన్లు నమోదు చేసాయి. అలా ప్లాపుల్లో ఉండి హిట్లు కొట్టిన హీరోల పై ఓ లుక్కేద్దాం రండి.
1) వరుణ్ తేజ్ : గతేడాది ఎండింగ్ లో ‘అంతరిక్షం’ చిత్రంతో డిజాస్టర్ మూటకట్టుకున్నాడు వరుణ్ తేజ్. ‘ఘాజీ’ ఫేమ్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం 2018 డిసెంబర్లో వచ్చింది. ఈ చిత్రం కనీసం 50 శాతం కల్లెక్షన్లని కూడా రాబట్టలేదు. దీంతో నిర్మాతలు భారీగా నష్టపోయారు. అలా డిజాస్టర్ అందుకున్న ఒక్క నెలలోనే… 2019 జనవరిలో ‘ఎఫ్2’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టేసాడు వరుణ్ తేజ్. ప్లాప్ లో ఉన్న హీరోకి మొదటి సంవత్సరమే బ్లాక్ బస్టర్ లభించింది.
2) కళ్యాణ్ రామ్ : 2018 లో కళ్యాణ్ రామ్ నటించిన ‘ఎం.ఎల్.ఏ’ చిత్రం యావరేజ్ గా నిలవగా.. ‘నా నువ్వే’ చిత్రం డిజాస్టర్ అయ్యింది. ఆ చిత్రాలకి ముందు కూడా కళ్యాణ్ రామ్ ప్లాపుల్లో ఉన్నాడు. ఇలాంటి తరుణంలో 2019 లో వచ్చిన ‘118’ చిత్రంతో హిట్టందుకున్నాడు. 2015 లో వచ్చిన ‘పటాస్’ చిత్రం తర్వాత.. అంటే నాలుగేళ్ళ తరువాత హిట్టందుకున్నాడు. అలా ప్లాపుల నుండీ బయటపడ్డాడు కళ్యాణ్ రామ్.
3) నాగ చైతన్య : ‘యుద్ధం శరణం’ ‘సవ్యసాచి’ వంటి డిజాస్టర్లతో రేస్ లో వెనుకపడ్డ నాగ చైతన్య.. ఈ ఏడాది వచ్చిన ‘మజిలీ’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. సమ్మర్లో విడుదలైన ‘మజిలీ’ చిత్రం నాగచైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.
4) నాని : వరుస హిట్లతో దూసుకుపోతున్న నానికి… 2018 లో ‘కృష్ణార్జున యుద్ధం’ ‘దేవదాస్’ వంటి సినిమాల రూపంలో రెండు ప్లాపులు పలకరించాయి. కానీ ఈ ఏడాది విడుదలైన ‘జెర్సీ’ చిత్రంతో హిట్టు కొట్టి మళ్ళీ ఫామ్లోకి వచ్చేసాడు.
5) సాయి ధరమ్ తేజ్ : ‘సుప్రీమ్’ సినిమా తరువాత మన మెగా మేనల్లుడు సాయి తేజ్ ను అరడజను ప్లాపులు పలకరించాయి. ఈ క్రమంలో వచ్చిన ‘చిత్రలహరి’ చిత్రంతో హిట్టందుకుని బౌన్స్ బ్యాక్ అయ్యాడు.
6) బెల్లంకొండ సాయి శ్రీనివాస్ : ఇండస్ట్రీకి వచ్చి 5 ఏళ్ళు పూర్తయినా… ఇప్పటి వరకూ సరైన హిట్టందుకోలేకపోయాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ‘అల్లుడు శీను’ ‘జయ జానకి నాయక’ వంటి చిత్రాలు పర్వాలేదనిపించినా అవి డైరెక్టర్ల అకౌంట్లోకి వెళ్ళిపోయాయి. దీంతో బెల్లంకొండకు క్రెడిట్ దక్కలేదు. దీంతో ‘రాట్ససన్’ రీమేక్ ను నమ్ముకున్నాడు. అయితే ప్లాపుల్లో ఉన్న హీరో… అలాగే ప్లాపుల్లో ఉన్న డైరెక్టర్ రమేష్ వర్మ (రైడ్ ఫేమ్) ఒక సూపర్ హిట్ రీమేక్ ను చెడగొట్టేసాతారేమో అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే సినిమా సూపర్ హిట్ అయ్యింది. బెల్లంకొండకు ఇలాంటి క్యారెక్టర్లు అయితేనే కరెక్ట్ అని ప్రూవ్ అయ్యింది. ఆలా ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోల్లో బెల్లంకొండ ఒకడు.