బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ఈసారి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎంటర్ టైన్మెంట్ కి అడ్డాఫిక్స్ అంటూ ప్రమోట్ చేసినా కూడా ఇది ఫ్లాప్ కి కేరాప్ అడ్రస్ గా మారింది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఆరు కారణాలు చెప్పుకున్నట్లయితే,,
నెంబర్ – 1
ఈసారి సీజన్ లో పార్టిసిపెంట్స్ సెలక్షన్ ప్రధానమైన కారణంగా చెప్పొచ్చు. ముఖ పరిచయం ఉన్నవాళ్లు చాలా కొద్దిమందే ఉన్నారు. సుదీప, చంటి, రేవంత్, బాలాదిత్య ఇలా కొంతమంది మాత్రమే తెలుగు ప్రేక్షకులకి తెలిసిన ముఖాలు ఉన్నాయి. అందులో కూాడ సుదీప చంటి త్వరగా ఎలిమినేట్ అయిపోయారు. బాలాదిత్య ఉన్నా కూడా మంచివాడనే ముద్రతో గేమర్ గా గేమ్ ఆడలేకపోయాడు. ఇక సెలక్షన్ లో చాలా ఫేసెస్ తెలియని వాళ్లవే. కపుల్ ఎంట్రీ ఇచ్చిన రోహిత్ ఇంకా మెరీనా ఇద్దరూ కూడా ఇటీవలకాలంలో ఫేమస్ సీరియల్స్ ఏమీ చేయలేదు.
ఇక రివ్యూవర్స్ ఇద్దరినీ సెలక్ట్ చేస్కోవడం కూడా బిగ్ బాస్ షోని దెబ్బకొట్టింది. గీతురాయల్, ఆదిరెడ్డి వీరిద్దరూ కూడా ఈసీజన్ లో గేమ్ ఆడటం కంటే కూడా లూప్స్ వెతకడం, వేరేవాళ్ల గేమ్ ని రివ్యూస్ చేయడం ఎక్కువగా చేశారు. అంతేకాదు, సెలబ్రిటీల స్టైల్లో గేమ్ వాళ్లు ఆడుతుంటే, బిగ్ బాస్ గేమర్స్ గా దొంగదారులు వెతుకుతూ టాస్క్ లో మజా లేకుండా చేశారు. ముఖ్యంగా గీతు వచ్చిన కొత్తల్లోనే అందర్నీ ఎండగట్టేందుకు చూసింది. తను అన్ ఫెయిర్ గేమ్ ఆడతానని చెప్తూ అందర్నీ కన్ఫూజన్ లోకి నెట్టేసింది. దీంతో ప్రతి పార్టిసిపెంట్ కూడా సేఫ్ గేమ్ ఆడటం మొదలుపెట్టారు. దీనివల్ల టాస్క్ లో వచ్చే మజా, ప్లేయర్స్ నేచరల్ గేమ్ ని దెబ్బతీసింది.
నెంబర్ – 2
బిగ్ బాస్ సీజన్ 6 పార్టిసిపెంట్స్ పెద్దగా పరిచయం లేనివాళ్లు అయినా కూడా గేమ్ లో ఒక్కసారి అలవాటు అయితే షోని ఇష్టపడేవాళ్లు కూడా ఈసారి షోకి దూరం అయ్యారు. కొంతమంది పార్టిసిపెంట్స్ గేమ్ లో మజాలేకుండా చేయడం, టాస్క్ ల్లో పెర్ఫామన్స్ చేయకుండా సేఫ్ గేమ్ ఆడటం వల్లే ఆడియన్స్ కి ఇంట్రస్ట్ లేకుండా పోయింది. మొదట్లో అర్జున్ కళ్యాణ్ శ్రీసత్యతోనే తిరగడం, ఆరోహి – సూర్య లవ్ ట్రాక్ లాంటి ఫ్రెండ్షిప్, అర్ధం పర్ధం లేని ఎపిసోడ్స్ వ్యూవర్స్ లో ఇంట్రస్ట్ ని తగ్గించేశాయి. అంతేకాదు, ఈసారి టాస్క్ లు కూడా డిజైన్ చేయడంలో బిగ్ బాస్ విఫలం అయ్యాడు. అందరూ ఫిజికల్ గేమ్ ఆడటానికి ఇష్టపడుతున్న సమయంలో బిగ్ బాస్ ఎంటర్ టైన్మెంట్ టాస్క్ లు పెట్టాడు.
అందరూ ఎంటర్ టైన్ చేయడానికి ట్రై చేస్తుంటే ఫిజికల్ టాస్క్ లు పెట్టారు. అన్ని టాస్క్ లు కెప్టెన్సీ కోసం కావడం, వేరే ఏదీ ఆసక్తి లేకపోవడం అనేది బిగ్ బాస్ వ్యూవర్స్ లో ఆసక్తిని తగ్గించేసింది. నాగార్జున వీకండ్ ఒకవైపు క్లాస్ పీకుతున్నా కూడా షోకి అనుకున్న రేటింగ్ ని రాబట్టలేకపోయింది.
నెంబర్ – 3
ఓటీటీలో 24 గంటల ప్రసారం కావడం అనేది షోకి పెద్ద మైనస్ అయ్యింది. నిజానికి ఈ ప్రయోగం గతంలో ఓటీటీలో మాత్రమే వచ్చిన బిగ్ బాస్ కిపెట్టారు. అప్పుడు అది టెలివిజన్ లో ప్రసారం చేయలేదు కాబట్టి రేటింగ్ పై అవగాహన లేదు. కానీ, ఇప్పుడు ఈ ప్రయోగం సీజన్ 6ని దెబ్బకొట్టింది. 24గంటలు ప్రసారంలో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగబోతోందనేది లైవ్ లో ముందుగానే తెలిసిపోతోంది. దీనివల్ల వ్యూవర్స్ కి టెలికాస్ట్ పై ఆసక్తి తొలగిపోతోంది. ఇక ఓటీటీలో ఏమైన ఉపయోగం ఉందా అంటే అది కూడా లేకుండా పోయింది. ఓటీటీలో కూడా లైవ్ చూసే వాళ్ల సంఖ్య కూడా చెప్పుకోదగినట్లుగా లేదు. ముఖ్యంగా బిగ్ బాస్ షో చూసే ప్రేక్షకులు ఒక గంటపాటు హాట్ స్టార్ లో లైవ్ చూస్తుంటే వాళ్ల మొబైల్ డేటా ఖర్చైపోతోంది. అందుకే ఆసక్తి ఆవిరైపోయింది.
నెంబర్ – 4
పార్టిసిపెంట్స్ ఆడిన గేమ్ ని బట్టీ వీకండ్ నాగార్జున వచ్చి వాళ్లకి బుద్దులు చెప్తుంటాడు. వాళ్లు ఎక్కడ గేమ్ తప్పు ఆడారు. ఎవరు ఎంత జెన్యూన్ గా ఆడారో వాళ్లకి చెప్తుంటాడు. కానీ, ఈసారి మొదటి నాలుగు వారాలు కూడా నాగార్జున ఎలాంటి క్లాస్ పీకలేదు. హౌస్ మేట్స్ ని గారం చేస్తూ వాళ్లతో కుళ్లు జోకులు వేస్తూ టైమ్ పాస్ చేశాడు. అంతేకాదు, శనివారం కూడా గేమ్స్ ఆడటం వల్ల వాళ్లు చేసే తప్పులు వాళ్లకి తెలియలేదు. ముఖ్యంగా గీతురాయల్ కి, మిగతా వాళ్లకి ఎప్పుడెప్పుడు క్లాస్ పడుతుందా అని వెయిట్ చేసిన ఆడియన్స్ కి ప్రతివారం నిరాశే ఎదురైంది.
దీంతో బిగ్ బాస్ షోని చూడటం చాలామంది మానేశారు. అంతేకాదు, ఈసారి షోలో గేమ్ బాగా ఆడేవాళ్లు మొదటి ఐదు-ఆరు వారాల్లోనే ఎలిమినేట్ అయిపోయి వెళ్లిపోవడం కూడా షోని దెబ్బతీసింది. షానీ, అభినయశ్రీ, నేహా, సుదీప, చంటి ఇలా గేమ్ బాగా ఆడేవాళ్లు అందరూ కూడా ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయిపోవడం కూడా షోని దెబ్బకొట్టిందనే చెప్పాలి.
నెంబర్ – 5
బిగ్ బాస్ షో లో ఏం జరుగుతోందని ముందుగానే రివ్యూవర్స్ చెప్పేయడం, ఎవరు కెప్టెన్ అయ్యారు ? టాస్క్ లో ఏం జరిగింది. ? ఏ ఇద్దరి మద్యలో కొట్లాట జరిగింది ? ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారు ? ఇలా ప్రతిదీ ముందుగానే లీక్ అవ్వడం వల్ల చాలామంది అప్డేట్స్ ని ఫాలో అవుతూ అసలు షోని పట్టించుకోలేదు. ఇక ప్రతి విషయం రివ్యూస్ లో ముందుగా చెప్పడం, ఎవరు ఎలా ఆడారు. వీళ్లు తప్పు, వీళ్లు రైట్ అని ముందుగానే జడ్జిమెంట్ ఇచ్చేయడం కూడా షోని దెబ్బకొట్టింది. దీంతో షో చూడాలన్న ఉత్సాహం చాలామందిలో నీరుకారిపోయింది.
నెంబర్ – 6
బిగ్ బాస్ హౌస్ లో గేమ్ బాగా ఆడేవాళ్లు కరువవ్వడం కూడా ఈసారి షోకి మైనస్. వచ్చిన కొద్దిమంది అయినా సరే గేమ్ ని అర్దం చేస్కోలేకపోవడం, అందులో లూప్స్ వెతుకుతూ బద్దకంగా కూర్చోవడమే చేశారు. కసిగా ఆడేవాళ్లు ఒకరో ఇద్దరో మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్లందరూ కూడా గట్టు మీద దాస్ లాగానే వ్యవహరించారు. ఏదో బ్రైయిన్ తో గేమ్ ఆడదాం అని చూసి మొదటికే మోసం తెచ్చుకున్నారు. ఫస్ట్ నుంచీ కూడా సీజన్ 6 ఇలాగే ఉంది. అందుకే ఆడియన్స్ లో ఆసక్తి తగ్గింది. అదీ మేటర్.