హను రాఘవపూడి (Hanu Raghavapudi) ‘అందాల రాక్షసి’ (Andala Rakshasi) సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే దర్శకుడిగా తన ముద్ర వేసుకున్నాడు. అది కమర్షియల్ గా ఆడకపోయినా… అతనికి అవకాశాలు రావడానికి కారణం, దర్శకుడిగా ఇతను మార్క్ ను చాటుకోవడం వల్లే అని చెప్పాలి. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ (Krishna Gaadi Veera Prema Gaadha) ‘సీతా రామం’ (Sita Ramam) వంటి సినిమాలతో ఆ నమ్మకాన్ని కూడా నిలబెట్టుకున్నాడు హను రాఘవపూడి. అయితే ఇతని కెరీర్లో ఇంకా రూ.100 కోట్ల సినిమా లేదు.
బడ్జెట్ పరంగా రూ.100 కోట్లు పెట్టిన నిర్మాత లేడు, అలాగే రూ.100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమా కూడా లేదు. అయినప్పటికీ ఇతని మీద రూ.600 కోట్లు పెట్టుబడి పెడుతున్నారట. అది మరెవరో కాదు ‘మైత్రి మూవీ మేకర్స్’ అధినేతలు అయిన వై.రవిశంకర్,(Y .Ravi Shankar), నవీన్ ఎర్నేని (Naveen Yerneni)..లు..! చెప్పుకోడానికి చాలా రిస్క్ అనిపిస్తుంది కదా..! అయినా నిర్మాతలకు ఆ రిస్క్ అనే భయం లేదు. వారి ధైర్యానికి కారణం ప్రభాస్.
అవును ప్రభాస్ (Prabhas) హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజి’ కి అక్షరాలా రూ.600 కోట్లు బడ్జెట్ పెడుతున్నారట ‘మైత్రి’ వారు. ఇప్పటివరకు ఈ బ్యానర్లో హైయెస్ట్ బడ్జెట్ సినిమా అంటే ‘పుష్ప 2′(Pushpa 2). దానికి రూ.400 కోట్లు బడ్జెట్ పెట్టారు. కానీ ‘ఫౌజి’ కోసం అదనంగా మరో రూ.200 కోట్లు పెడుతున్నారు. ఇది చిన్న విషయం కాదు. కానీ ‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD) సినిమాకి ముందు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఖాతాలో కూడా రూ.100 కోట్ల సినిమా లేదు.
కానీ ‘కల్కి 2898 AD’ కోసం రూ.500 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. ఆ సినిమా రూ.1100 కోట్ల వరకు కొల్లగొట్టింది. హను రాఘవపూడి విషయంలో అదే నమ్మకం కలిగున్నారు ‘మైత్రి’ వారు. ఇప్పటివరకు తీసిన ఫుటేజీతో కూడా వాళ్ళు సంతృప్తిగా ఉన్నారట. 2026 సెకండాఫ్ లో ‘ఫౌజి’ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని వినికిడి.