భారతీయ సినిమా ముఖ చిత్రాన్ని మార్చి వేసిన సినిమా బాహుబలి. తెలుగువారి సత్తా ఏమిటో ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన బాహుబలి, విజయానికి కొత్త నిర్వచనం చెప్పింది. సినిమాలో విషయం ఉంటే వంద కాదు వెయ్యి కోట్లు సాధించవచ్చని నిరూపించిన చిత్రం బాహుబలి. ఎవరూ అందుకోలేని బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి రికార్డ్స్ గురించి మాట్లాడాలంటే సమయం సరిపోదు. ఏ సినిమా అయినా తమ రికార్డును నాన్ బాహుబలిగా చెప్పుకొనేంతగా ఆ సినిమా చిత్ర సృష్టించింది.
సౌత్ ఇండియన్ సినిమా అంటే చిన్న చూపు చూసే బాలీవుడ్ కి…మేము మీకు అందనంత ఎత్తులో ఉన్నాం అని చాటి చెప్పిన మూవీ. బాహుబలి స్పూర్తితో బాలీవుడ్ తో పాటు, దేశంలోని అనేక పరిశ్రమలలో ఇలాంటి చిత్రాలు తెరకెక్కినా… ఆ మూవీ అంచులకు చేరుకోలేకపోయాయి. మరి ఇంతటి ఘన చరిత్రకు నాంది పలికిన రోజు నేడు. సరిగ్గా ఏడేళ్ల క్రితం ఇదే రోజు బాహుబలి సినిమా మొదటిరోజు షూట్ ప్రారంభమైంది. జులై 6, 2013న బాహుబలి చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. దీనితో బాహుబలి టీమ్ ఆ అద్భుత దినాన్ని గుర్తు పెట్టుకొని అభిమానులతో పంచుకున్నారు.
అదే ఏడాది కొరటాల శివ మొదటి చిత్రం మిర్చి సినిమాలో ప్రభాస్ నటించాడు. ఫిబ్రవరిలో ఆ మూవీ విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ సినిమా విడుదలైన ఐదు నెలలకు ప్రభాస్ బాహుబలి మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలి అనే రెండు పాత్రల కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. ఓ పాత్ర కోసం భారీగా కండలు పెంచగా, మరో పాత్ర కోసం కొంచెం సన్నబడ్డాడు. రాజమౌళి సారధ్యంలో భారీ టీమ్ ఓ చారిత్రక విజయం నమోదు చేశారు.
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
Most Recommended Video
భానుమతి & రామకృష్ణ సినిమా రివ్యూ & రేటింగ్!
సినిమాల్లోకి రాకముందు మన హీరోయిన్స్ ఎలా ఉంటారో చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!
అట్టర్ ఫ్లాప్ సీజన్ అంటే ఇదేనేమో..!