శివ కార్తికేయన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మురుగదాస్ వరుస ప్లాపుల్లో ఉన్నప్పటికీ శివ కార్తికేయన్ రూపంలో మంచి అవకాశమే దొరికింది అని చెప్పాలి. ఈ సినిమాతో మురుగదాస్ కచ్చితంగా హిట్టు కొట్టాలి. లేదు అంటే అతనికి మరో ఛాన్స్ దొరకడం కష్టం. ఇదిలా ఉంటే.. ‘మదరాశి’ సినిమాని దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ పెట్టి ‘శ్రీ లక్ష్మీ మూవీస్’ బ్యానర్ పై ఎన్.శ్రీ లక్ష్మీ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
‘అమరన్’ తో శివ కార్తికేయన్ రూ.300 కోట్ల క్లబ్ లో చేరాడు. కానీ దానికి ముందు ఇతను ఓ మిడ్ రేంజ్ హీరో. మనకి నాని లాంటి హీరో అనమాట. శివ కార్తికేయన్ సినిమాలు చాలా వరకు రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తాయి. కానీ ‘అమరన్’ మరో 2 రెట్లు పైనే కలెక్ట్ చేసింది. ఓటీటీలో కూడా ఆ సినిమాని ఎగబడి చూశారు. అందుకే ‘మదరాశి’ పై నిర్మాతల రూ.200 కోట్లు పెట్టడానికి రెడీ అయ్యారు అని స్పష్టమవుతుంది. ఆల్రెడీ ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ను అన్ని భాషలతో కలుపుకుని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ రూ.40 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇక శాటిలైట్ హక్కులను జీ సంస్థ 26 కోట్లకు కొనుగోలు చేసింది. అనిరుధ్ సంగీత దర్శకుడు కాబట్టి రూ.10 కోట్లు ఆడియో హక్కులు అమ్మినట్టు తెలుస్తుంది. సో అలా రూ.76 కోట్లు రికవరీ అయినట్టే.ఇంకా డబ్బింగ్ రైట్స్ వంటివి ఉన్నాయి. సినిమా హిట్ అయితే రీమేక్ రైట్స్ రూపంలో కూడా మంచి డీల్స్ వచ్చే అవకాశం ఉంది. సో థియేటర్ల రూపంలో మిగిలింది రికవరీ అవుతుందా? అనేది చూడాలి.